Andhra Pradesh

News June 13, 2024

14న తిరుపతిలో ఉద్యోగ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 14వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఫార్మసీ, బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. 50 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 12, 2024

శ్రీకాకుళం: B.Ed మొదటి సెమిస్టర్ నోటిఫికేషన్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులు జరిమానా లేకుండా పరీక్ష రుసుం చెల్లించేందుకు జులై 3 చివరి తేదీ. అభ్యర్థులు మొత్తం యూనివర్సిటీ మైగ్రేషన్ ఫీజుతో కలిపి రూ.1,635 పరీక్ష ఫీజును చెల్లించాలి. జులై 19 నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

News June 12, 2024

తూ.గో: ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ చిత్రం

image

నరసాపురం పట్టణం రుస్తుంబాదుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ పవన్ కళ్యాణ్‌ పై తనకున్న అభిమానాన్ని చిత్రం రూపంలో చాటుకున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గన్నవరంలో మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. దీంతో విజయ్ మోహన్‌ను పలువురు అభినందిం చారు.

News June 12, 2024

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అతని తలపై రాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతదేహాన్ని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 12, 2024

ప.గో: అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం

image

నరసాపురం పట్టణం రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ తన ప్రతిభను చూపించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విజయవాడలో మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. ఈ చిత్రాన్ని గీసిన విజయ్ మోహన్‌ను పలువురు అభినందించారు.

News June 12, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రేపు గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వారు బుధవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద గాని, కరెంట్ పోల్స్ వద్ద గాని ఉండవద్దని, కురిసే వర్షాలకు అనుగుణంగా లోతట్టు ప్రాంత వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News June 12, 2024

ప్రొద్దుటూరు: ఆప్కాబ్ ఛైర్ పర్సన్ రాజీనామా

image

ఆప్కాబ్ ఛైర్ పర్సన్ పదవికి మల్లెల ఝాన్సీ రాణి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు ఆమె పేర్కొన్నారు. 2021 జులై 26 నుంచి ఆప్కాబ్ ఛైర్ పర్సన్ గా పనిచేస్తున్నానని, 2024 జనవరి 12న నాటి ప్రభుత్వం 2024 జులై 17 వరకు తన పదవీ కాలాన్ని పొడిగించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులను లాభాల బాటలో నడిపి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు.

News June 12, 2024

ఇచ్ఛాపురం: రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

image

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఇచ్ఛాపురం దాసన్నపేట మెయిన్ రోడ్డులో నివాసం ఉన్న కస్పా రాజేష్ (32) హైదరాబాదులో ఒక ప్రైవేట్ జిమ్‌లో శిక్షకుడిగా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా సింహాచలం దర్శనానికి ఇచ్ఛాపురం వస్తుండగా శ్రీకాకుళం పరిసరాలలో రైలు నుంచి జారి పడిన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు ఉన్నారు.

News June 12, 2024

తాడిపత్రి: ఇది చెరువు కాదు.. కళాశాల క్రీడామైదానం.!

image

తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జలమయమైంది. పట్టణంలోని విద్యార్థులకు, క్రీడాకారులకు ఇదొక్కటే క్రీడా మైదానం. చిన్నపాటి వర్షాలకే మడుగులా మారుతోంది. విద్యార్థులు ఆటలకు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డైలీ వాకర్స్ సైతం నీరు నిలిచి ఉండడంతో వాకింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

News June 12, 2024

మాచవరం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి (35) అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.