Andhra Pradesh

News June 12, 2024

శ్రీకాకుళం: విజయనగరంపై విశాఖ జట్టు విజయం

image

టెక్కలిలో జరుగుతున్న అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో రెండో రోజు విజయనగరం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగులు చేయగా తదుపరి బ్యాటింగ్ చేసిన విజయనగరం జట్టు 274 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో 64 పరుగులతో విశాఖ జట్టు గెలుపొందింది. ఆర్గనైజింగ్ కన్వీనర్‌గా ఎన్.లాల్ బహుదూర్ వ్యవహరించారు.

News June 12, 2024

VZM: 40% వైన్ షాపులు కేటాయించాలని డిమాండ్

image

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు వైన్ షాపులను కేటాయిస్తామన్న హామీని అమలు చేయాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం సీఐటీయూ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన షాపుల్లో 40 శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించాలన్నారు. యాత కులస్థులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. 

News June 12, 2024

కర్నూలు: చంద్రబాబు సమీక్షలో జిల్లా మంత్రులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 12, 2024

SKLM: CM చీఫ్ సెక్రటరీగా సిక్కోలు వాసి

image

నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామానికి చెందిన IAS అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ, CMO కార్యాలయం చీఫ్‌గా నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి స్వీకరణ అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించారు.

News June 12, 2024

కడప: 28 నుంచి వైవీయు పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

image

యోగి వేమన యూనివర్సిటీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంపీఈడీ (పీజీ) 2, 4 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28, జులై 1, 3, 5, 8, 10 తేదీలలో, 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29, జులై 2, 4, 6, 9, 11 తేదీలలో జరుగుతాయన్నారు. వీటితోపాటు ఎంబీఏ పరీక్షలు మొదలవుతాయన్నారు.

News June 12, 2024

ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో జాబ్ మేళా

image

కలెక్టరేట్ ఆవరణలో జూన్ 15వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2 ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కలవన్నారు. ఆసక్తిగల 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాసైన 35 సంవత్సరాల లోపు వారు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. జీతం రూ 11 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందన్నారు. ఉద్యోగం సాధించిన వారికి భోజనం, వసతి కలదన్నారు.

News June 12, 2024

మరికాసేపట్లో చంద్రబాబు రాక.. భారీ భద్రత

image

సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి చంద్రబాబు తిరుపతి, తిరుమల పర్యటన చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన తిరుమలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా డీఐజీ షిముషి బాజ్ పాయ్ అధ్వర్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. సీఎం పర్యటన కోసం 1550 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. కొండపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

News June 12, 2024

తిరుమలకు బయలుదేరిన సీఎం

image

CM చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గం.కు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో బసచేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. CM తిరుపతి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

News June 12, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించాలి: సుమిత్

image

ప.గో జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓకు సూచించారు. పేషెంట్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని అన్నారు. 

News June 12, 2024

పాడేరులో ఘోర ప్రమాదం

image

పాడేరు ఘాట్ రోడ్ 12 మైళ్ళ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు మోదకొండమ్మ జాతరకు సౌండ్, లైటింగ్ సిస్టమ్స్ తెచ్చి తిరిగి వైజాగ్ వెళుతుండగా డీసీఎం లారీ బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకుపోయింది. లారీలో ఉన్న 11 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో కనిపించిన ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురు లోయలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.