Andhra Pradesh

News June 12, 2024

కడప: 6 సార్లు ఎమ్మెల్యే అయినా దక్కని మంత్రి పదవి

image

ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.

News June 12, 2024

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత: ఢిల్లీరావు

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ ఆయన చాంబర్లో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోస్టల్ విడుదల చేశారు. 

News June 12, 2024

నందికొట్కూరు: టెంకాయపై ప్రధాని, CM, పవన్ చిత్రాలు

image

నందికొట్కూరు పట్టణానికి చెందిన చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం పురస్కరించుకొని పచ్చి టెంకాయ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను గీసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాను ఆయన తెలిపారు.

News June 12, 2024

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు..?

image

రాష్ట్ర శాసనసభలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా విష్ణుకుమార్ రాజును ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విష్ణుకుమార్ రాజు గతంలోనూ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. బుధవారం సాయంత్రం విజయవాడలో జరుగుతున్న బీజేపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. 

News June 12, 2024

ఏయూ: జూలై 13 నుంచి బీ.ఈ, బీటెక్ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థుల కోసం నిర్వహించే స్పెషల్ ఎగ్జామినేషన్స్ జూలై 13 నుంచి ప్రారంభం కానున్నాయని డిప్యూటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరిగే తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

News June 12, 2024

ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపాలి: కలెక్టర్ వినోద్ కుమార్

image

ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరులకు వోల్వో బస్సులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను పంపించాలన్నారు.

News June 12, 2024

ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అనిత

image

ప్రజలు చాప కింద నీరులా చేసిన విప్లవం వలనే కూటమి భారీ విజయం సాధించిందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అహకారానికి , అభివృద్ధికి జరిగిన యుద్ధంలో అభివృద్ధే గెలిచిందన్నారు. రాక్షస పాలన పోయిందని ఆంధ్ర ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ శాఖ ఇచ్చినా తన మార్కు ఉండే విధంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు, ఎన్డీఏ మార్కు పాలన చేస్తానని వెల్లడించారు.

News June 12, 2024

లావేరు: వ్యాన్ బోల్తా 1500 కోళ్లు మృతి

image

లావేరు మండలంలోని బెజ్జిపురం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. SKLM నుంచి VSKP వెళ్తున్న కోళ్లు వ్యాన్ రహదారి పక్కన ఆగివున్న లారీని అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో 1600 కోళ్లు ఉండగా,1500 కోళ్లు ప్రమాదంలో మరణించాయి. కాగా వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు.

News June 12, 2024

మంత్రి‌ గుమ్మిడి సంధ్యారాణికి ఏ శాఖ..?

image

రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కేటాయించే శాఖపై ఆసక్తి నెలకొంది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెకు కేటాయించే శాఖపై చర్చించుకుంటున్నారు.‌ గిరిజన సంక్షేమ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తుండగా.. ఆమె టీచర్‌గా పనిచేసిన కారణంగా విద్యాశాఖ సైతం అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

News June 12, 2024

అనితకు ఏ శాఖ..?

image

మంత్రి వంగలపూడి అనితకు కేటాయించే శాఖపై ఆసక్తి నెలకొంది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెకు కేటాయించే శాఖపై చర్చించుకుంటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తుండగా.. ఆమె టీచర్‌గా పనిచేసిన కారణంగా విద్యాశాఖతో పాటు హోంశాఖ అయినా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.