Andhra Pradesh

News June 12, 2024

తూ.గో.: 1995 తోడల్లుడు.. ఇప్పుడు వదిన

image

టీడీపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబునాయుడు మంగళవారం ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే 1995లో తొలిసారిగా సీఎం అయిన సందర్భంలో చంద్రబాబును పార్టీ శాసనపక్ష నేతగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. తాజాగా 29 ఏళ్ల తర్వాత చంద్రబాబు వదిన, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు.

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కామినేని దూరం

image

కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. త్వరలో వచ్చి నియోజకవర్గ ప్రజలను కలుస్తానని చెప్పారు.

News June 12, 2024

2వ సారి మంత్రిగా అచ్చెన్నాయుడు

image

టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 2వసారి మంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర కార్మిక, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు తాజాగా ఏపీ కేబినెట్‌లో మరోసారి చోటదక్కింది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో జిల్లా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 12, 2024

భూమా అఖిల ప్రియకు నిరాశ

image

ఆళ్లగడ్డ నుంచి గెలుపొంది భూమా అఖిల ప్రియకు నిరాశ ఎదురైంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆమె.. 2014 ఉప ఎన్నికలో YCP తరఫున MLAగా ఏకగ్రీవమయ్యారు. 2016లో TDPలో చేరి చంద్రబాబు మంత్రివర్గంలో పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమి చెందినా ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. మరోసారి మంత్రి పదవి వస్తుందని భావించినా చివరికి నిరాశ ఎదురైంది.

News June 12, 2024

VZM: జిల్లాలో బాలుడి దారుణ హత్య

image

జిల్లాలోని నెల్లిమర్ల మండల కేంద్రమైన కొండపేటలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకి వెళ్లిన బాలుడు సమీప కొండ ప్రాంతంలో మంగళవారం విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటి నిండా గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. ఆన్‌లైన్ గేమ్స్ హత్యకు కారణంగా ఎస్.ఐ గణేశ్ తెలిపారు. స్నేహితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 12, 2024

నెల్లూరు: నాడు టీచర్.. నేడు మినిస్టర్

image

MSc, PhD చేసిన పొంగూరు నారాయణ నెల్లూరులోని VR కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1979లో ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్‌గా మొదలైన ఆ ప్రస్థానం అనతికాలంలోనే దేశమంతా విస్తరించింది. 1999లో వైద్యకళాశాలను నెల్లూరులో స్థాపించారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో 72వేల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

News June 12, 2024

సిక్కోలుకు కాస్త నిరాశ?

image

రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు వస్తాయని ఆశించిన జిల్లా నేతలకు నిరాశ ఎదురైంది. అచ్చెన్నతో పాటు మరో ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం వస్తుందని భావించినప్పటికీ పలు సమీకరణాలతో ఆ ఛాన్స్ రాలేదు. అచ్చెన్నను మాత్రమే మరోసారి అమాత్య యోగం వరించింది. మంత్రి పదవి రేసులో హ్యాట్రిక్ విజేత బెందాళం అశోక్, కోండ్రు మురళి, కూన రవికుమార్, గౌతు శిరీష పేర్లు వినిపించడం విదితమే.

News June 12, 2024

అభ్యంతరాలు 15 లోపు తెలియజేయాలి: డీఈఓ సుభధ్ర

image

స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్సైట్‌లో పెట్టినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మంగళవారం తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేయాలన్నారు.

News June 12, 2024

కడప: టీటీడీ బోర్డు పదవికి యానాదయ్య రాజీనామా

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బీసీ రాష్ట్ర నేత సిద్దవటం యానాదయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు పంపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News June 12, 2024

విశాఖ: నాడు టీచర్.. నేడు మినిస్టర్

image

MA, BED చేసిన వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2014లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె దశాబ్ధ కాలంలో ఎన్నో పదవులు చేపట్టారు. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, టీటీడీ సభ్యురాలిగా సేవలందిచారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత చంద్రబాబు కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.