Andhra Pradesh

News June 12, 2024

విశాఖ: నాడు టీచర్.. నేడు మినిస్టర్

image

MA, BED చేసిన వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2014లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె దశాబ్ధ కాలంలో ఎన్నో పదవులు చేపట్టారు. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, టీటీడీ సభ్యురాలిగా సేవలందిచారు. పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత చంద్రబాబు కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.

News June 12, 2024

వెంకట్రావుపల్లిలో తప్పిన పెను ప్రమాదం

image

ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. గాలి వాన ధాటికి గ్రామంలోని దుగ్గిన బోయిన నాగేశ్వరావు ఇంటి ఎదురుగా మెయిన్ లైన్ విద్యుత్ తీగ తెగిపడింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విద్యుత్ తీగ తెగిపడడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసిన లైన్ మాన్ స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు.

News June 12, 2024

అనూహ్య పరిణామాల మధ్య టికెట్.. నేడు మంత్రి పదవి

image

చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొలుసు పార్థసారథి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. పెనమలూరులో వైసీపీ సిట్టింగ్ MLAగా ఉన్న ఆయనను చంద్రబాబు నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సైతం పరిష్కరించి క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించిన పార్థసారథి.. నూజివీడులో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరేసి తాజాగా మంత్రి పదవి చేపట్టనున్నారు.

News June 12, 2024

డిగ్రీ విద్యార్థులకు 17వ తేదీ వరకు సెలవుల పొడిగింపు

image

అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల వేసవి సెలవులను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీసీటీఏ) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీటీఏ నాయకులు శ్రీధర్, జయప్ప, రంగనాథ్, రాజశేఖర్ పాల్గొన్నారు.

News June 12, 2024

త్రిబుల్ ఐటీలకు 48 వేల దరఖాస్తులు

image

ఏపీలోని నాలుగు ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎప్పటి వరకు 48 వేల దరఖాస్తులు అందినట్లు అడ్మిషన్లు కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు ఐటీలలో కలిపి ఈ డబ్ల్యూ‌ఎస్ కోట కలిపి 4400 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు జాబితాలో జూలై 11న విడుదల చేస్తామని వివరించారు.

News June 12, 2024

SPMVV: PGలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) పీజీ (PG) M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. GAT-B 2024 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 15.

News June 12, 2024

పల్నాడు టీడీపీ నేతలకు నో ఛాన్స్!

image

చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో 24 మందితో మంత్రివర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఇందులో పల్నాడులోని ఒక్క నాయకుడికి చోటు దక్కలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణలకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఎదురు చూశారు.

News June 12, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలల విద్యార్థులు గమనించాలని విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటన వెలువరించింది. కాగా నేడు సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున ఈ రోజు పాఠశాలలకు విద్యాశాఖ సెలవును ప్రకటించింది.

News June 12, 2024

VZM: నిబంధనలు పాటించని 77 మందికి ఈ-చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను బుధవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 77 మందిపై రూ. 25,055 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 17 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 12, 2024

గొట్టిపాటి, వీరాంజనేయస్వామి రాజకీయ నేపథ్యం..

image

ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మంత్రి పదవులకు ఎంపికయ్యారు. స్వామి 3 సార్లు, గొట్టిపాటి రవికుమార్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరికీ ఏ శాఖలు కేటాయించనున్నారో అన్న అంశం ఆసక్తిగా మారింది.