Andhra Pradesh

News June 12, 2024

కందుల దుర్గేశ్ అను నేను..

image

కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దుర్గేశ్ వివిధ హోదాల్లో పనిచేసి MLC అయ్యారు. తూ.గో. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాజమండ్రి MPగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరి 2019లో రాజమండ్రి గ్రామీణం నుంచి MLAగా పోటీచేసి ఓటమి చెందారు. తాగా ఎన్నికల్లో నిడదవోలు నుంచి 33,304 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.

News June 12, 2024

జగన్మోహన్ రెడ్డిని కలిసిన శ్రీకాకుళం వైసీపీ నేతలు

image

సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన వైసిపి పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి చావలేదని ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాడుతారని తెలియజేశారు.

News June 12, 2024

ఏలూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఇక్కడ ఫ్రీ చాయ్

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఓ టీ దుకాణ యజమాని తన అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుధవారం తన షాపులో ఉదయం 10 గంటల వరకు కాఫీ, టీ ఉచితంగా ఇస్తున్నట్లు జంగారెడ్డిగూడేనికి చెందిన ఎం.రాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దుకాణం (కనక నాగ శివాని టీ స్టాల్) వద్ద బ్యానర్ ఏర్పాటుచేశారు.

News June 12, 2024

శ్రీ సత్యసాయి: తొలిసారి గెలుపు.. వరించిన మంత్రి పదవి

image

పెనుకొండ MLA సవితకు తొలిసారి కేబినెట్‌లో స్థానం దక్కింది. ఈమె వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై గెలుపొందారు. ఈమె 1977 జనవరి 15న పెనుకొండ మండలం రామపురంలో జన్మించారు. తండ్రి ఎస్.రామచంద్రరెడ్డి. 1998లో అనంతపురం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. 2018లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారి తొలిసారి గెలుపొందారు.

News June 12, 2024

ఉమ్మడి విజయనగరంలో మంత్రి పదవులు వీరివే..

image

ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రివర్గంలోకి అవకాశం దక్కింది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌, సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణిని మంత్రి పదవులు వరించాయి. వీరిద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ముగ్గురు మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఇందులో సంధ్యారాణి కూడా ఉన్నారు.

News June 12, 2024

గంటా, అయ్యన్నకు ఈసారి నో ఛాన్స్!

image

ఏపీ నూతన కేబినెట్ కూర్పు చంద్రబాబు రాజకీయ చతురతకు నిదర్శనంగా మారింది. ఉమ్మడి విశాఖకు సంబంధించి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ వంటి సీనియర్లను సైతం పక్కనపెట్టి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు మంత్రి పదవి ఇచ్చారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే కేబినెట్లో చోటుదక్కడం గమనార్హం.

News June 12, 2024

ప్రకాశం జిల్లా నుంచి మంత్రులు వీరే..

image

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. 24 మందితో కూడిన జాబితాను జాబితాను తాజాగా ఆయన ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. డోలా బాల వీరాంజనేయస్వామి( కొండపి), గొట్టిపాటి రవి కుమార్( అద్దంకి)కు చోటు దక్కించుకున్నారు. వీరికి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

News June 12, 2024

తొలిసారి గెలుపు.. కర్నూలు జిల్లా నుంచి మంత్రి

image

కర్నూలు MLA టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించింది. జిల్లా నుంచి ఈయనకు మాత్రమే కేబినెట్‌లో స్థానం దక్కింది. భరత్ 2019లో పోటీ చేసి ఓడినా.. ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంతియాజ్‌పై భారీ మెజారిటీతో తొలిసారి గెలుపొందారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా వైశ్యుల నుంచి రాష్ట్రంలో కేటాయించిన ఒకేఒక్క మంత్రి పదవి భరత్‌కు చంద్రబాబు కేటాయించారు. దీంతో భరత్ అభిమానులు, TDP నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 12, 2024

తూ.గో. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 మంది MLAలలో ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాశ్, తూ.గో. జిల్లా నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ముగ్గురూ తొలిసారి MLAలుగా గెలుపొంది మంత్రులవడం విశేషం.

News June 12, 2024

వంగలపూడి అనితకు మంత్రి పదవి

image

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.