Andhra Pradesh

News September 13, 2025

సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్‌గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

News September 13, 2025

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.

News September 13, 2025

తాగునీటి చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

image

అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.

News September 13, 2025

రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్‌లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్‌లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్‌లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.

News September 13, 2025

నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి మైథిలి కళ్లు దానం

image

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.

News September 13, 2025

తూ.గో: కొత్త కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో

image

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.

News September 13, 2025

ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

image

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం సృష్ఠించాయి. పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. శుక్రవారం స్కూల్లో అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు చికిత్స అందించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల విద్యార్థినులకు విషజ్వరాలు రావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్‌ వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News September 13, 2025

నెల్లూరు: ఆ బార్లకు రీ నోటిఫికేషన్

image

జిల్లాలో నిర్వహించకుండా ఓపెన్ కేటగిరిలో ఉన్న 32 బార్లకు, గీత కులాల రిజర్వుడు కింద ఉన్న 1 బార్ కి సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా నిషేధ, ఎక్సైజ్ శాఖాధికారి తెలిపారు. ఈ నెల 17న దరఖాస్తుల స్వీకరణ, 18 న లాటరీ, ఎంపిక ప్రక్రియలను చేపట్టానున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు చేయాలని కోరారు

News September 13, 2025

జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.