India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన వెంకట రమణమూర్తి 29వ తేదీన ప్రమాదానికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్ ఆయనకు అందలేదు. వాట్సాప్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో ఈ రోజు ఆయనకు పింఛను అందజేశారు. కలెక్టర్‌కి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 20,21 వ తేదీలలో జరుగనున్న శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత ఈ రోజు నగర పోలీసు కమీషనర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు రివ్యూ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పలు గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను వీడియోల ద్వారా పరిశీలించారు. దారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు, సముద్ర స్నానాల్లో భద్రత చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ నియమితులైన ఓ. ఆనంద్ బుధవారం విజయవాడ నుంచి నెల్లూరు చేరుకున్నారు. ఆయనకు చింతారెడ్డి పాలెం హైవే వద్ద నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుబ్బారెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. గురువారం కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
నేడు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు అల్లూరి సీతారామ రాజు జయంతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల్లో అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలని సర్కులర్ జారీ చేశారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2024 కొరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు తెలిపారు. కనీసం పది సంవత్సరాల సర్వీసు కలిగి ఉండాలని సెల్ఫ్ నామినేషన్ ద్వారా https://nationalawards toteachers.education.gov.in అనే వెబ్సైట్లో ఈనెల 15 లోపు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
ఉపాధి హామీ చట్టం క్రింద చేపట్టే పనులలో నాణ్యత సత్వరం పూర్తిచేయుట ఎంతో కీలకమని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. బుధవారం ఆమె జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వామా ఆధ్వర్యంలో వ్యవసాయ – అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై ఆరా తీశారు. జిల్లాలోని కూలీలకు లభిస్తున్న రోజువారీ వేతనం, పని దినాల సంఖ్య తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
యోగివేమన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ నియామకాలలో అక్రమాలకు పాల్పడిన మాజీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటి మాజీ వీసీ చింతా సుధాకర్‌పై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనున్నట్లు చెప్పారు.
కోవిడ్ సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్ ఛార్జీలలో రాయితీని పెంచాలని.. అలాగే వికలాంగులకు రాయితిని అందించే సౌకర్యాలు పెంచాలన్నారు.
* M.com పరీక్షల టైం టేబుల్ విడుదల * రేపు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు * ఏపీఎల్‌లో సిక్కోలు ఆటగాడి ప్రతిభ * నంద్యాల జిల్లా కలెక్టర్‌గా టెక్కలి వాసి* హత్రాస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ నాయుడు సానుభూతి * ఆపదలో ఆదుకున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ * రేపు జిల్లా వ్యాప్తంగా వర్షాలు
Sorry, no posts matched your criteria.