Andhra Pradesh

News June 11, 2024

పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి: సీపీ రామకృష్ణ

image

రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో విజయవాడ నుంచి, ఇతర ప్రదేశాల నుంచి గన్నవరం ఫంక్షన్ ప్లేస్‌కు పాస్‌లు ఉన్న బస్సులు, కార్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని పోలిస్ కమిషనర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పాస్‌లు లేని ఇతర వాహనాలు అనుమతించబడదని, విజయవాడలోని 9 ప్రాంతాల నుంచి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రామాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు.

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పిఠాపురంలో స్క్రీన్లు

image

జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం ప్రజలు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు చిన్నమాంబ పార్కు, ఆర్టీసీ కాంప్లెక్స్, ఏబీసీ చర్చి, RRపార్కు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రత్యేక ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

News June 11, 2024

శారదా నదిలో పడి ఇద్దరు యువకుల మృతి

image

యలమంచిలి మండలం తెరవుపల్లిలో శారదా నదిలో మునిగి దిమిలికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకకు చెందిన జగన్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వారం క్రితం మేనమామ ఇంటికి వచ్చిన వీరు ప్రతిరోజు నదికి వెళ్లేవారని ఇవాళ నీటి ఒరవడి ఎక్కువగా ఉండడం వల్ల వీరు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.

News June 11, 2024

నీటి కుంటలో పడి మూడేళ్ల బాలుడి మృతి

image

నీటికుంటలో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామపంచాయతీలోని సంఘాలకు చెందిన మహానంది, గాయత్రి దంపతుల కుమారుడు అనిల్(3) ఆడుకోవడానికి బయటకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్రామంలోని బీసీ కాలనీలోని నీటి కుంటలో పడి మృతిచెందారు.

News June 11, 2024

త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి ఫ్లైఓవర్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ఆర్మీ జవాన్ ఓబులేసు (35)గా పోలీసులు గుర్తించారు. ఇతడిది పోరుమామిళ్ల గ్రామమని, బంధువులకు సమాచారం అందించినట్లు
ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News June 11, 2024

విశాఖ: హత్య కేసు.. పదేళ్ల జైలుశిక్ష

image

హత్య కేసులో ముద్దాయికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం పీడీజే కోర్టు తీర్పునిచ్చిందని SP మురళీకృష్ణ తెలిపారు. ’నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పైల రమణకు సుర్ల వెంకటరమణతో భూతగాదాలున్నాయి. ఈ క్రమంలో జరిగిన గొడవతో వెంకటరమణను పైల రమణ హత్య చేశాడు. మృతుడి తల్లి చిన్నమ్మలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు.

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పక్కా ఏర్పాట్లు: వికాస్ మర్మత్

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News June 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నరసాపురం, భీమవరం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే నాలుగు రైళ్లు జూన్ 24 నుంచి జూలై 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. మచిలీపట్నం(02), నరసాపురం(01), భీమవరం(01) వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి. 

News June 11, 2024

ఈఏపీసెట్‌లో టెక్కలి విద్యార్థికి రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు

image

టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్‌ సాయి అనే విద్యార్థికి మంగళవారం విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ప్రణవ్ సాయి ఇటీవల విడుదల అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయి 62వ ర్యాంకు, నీట్ లో ఆల్ ఇండియా 430వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని స్థానికులు అభినందించారు.

News June 11, 2024

కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వాసి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ సాయి నగర్‌కు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయవాడలోని కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గత ఎన్నికల్లో భారీగా పందేలు పెట్టి పెద్దమొత్తంలో డబ్బు నష్టపోయినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలు సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో కొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతన్ని బుల్లెట్ సుబ్బారావు అని కూడా అంటారు.