Andhra Pradesh

News June 11, 2024

విజయవాడ: మీడియాను పునరుద్ధరించాలంటూ ఎంపీ లేఖ

image

ఏపీలో మీడియాను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ట్రాయ్‌కి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పలు ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేసేలా కేబుల్ ఆపరేటర్లపై కొత్త ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకుని ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.  

News June 11, 2024

మచిలీపట్నం వద్ద లారీ కిందపడి.. రేపల్లె మహిళ మృతి

image

మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News June 11, 2024

VZM: విద్యుత్ కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు

image

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం కొలువుదీరనున్న నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టరేట్‌తో పాటు ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారాల వీక్షణకు ఏర్పాట్లు చేశారు.

News June 11, 2024

కేశినేనిపల్లి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి ఫ్లై ఓవర్ సమీపంలో మంగళవారం కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.

News June 11, 2024

ఏలూరు: ఒకే ఇంట్లో రెండు భారీ పాములు

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ ఇంట్లో రెండు భారీ కోడె నాగులు హల్ చల్ చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై సమాచారాన్ని స్నేక్స్ సేవియర్ సొసైటీ చదలవాడ క్రాంతికి తెలియజేశారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పాములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

News June 11, 2024

కృష్ణా: ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, MCOM, MHR 4వ సెమిస్టర్ పరీక్షలకు(23-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 18లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 11, 2024

పెనుకొండలో రేపటి నుంచి అన్న కాంటీన్ పునః ప్రారంభం

image

పెనుకొండ పట్టణంలో ఎమ్మెల్యే సవిత ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను బుధవారం నుంచి తిరిగి ప్రారంభం చేయనున్నట్లు మంగళవారం సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వల్ల అన్న క్యాంటీన్ నిర్వహణ సాధ్యం కాలేదని ఆమె తెలిపారు. జూన్ 12 బుధవారం నుంచి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను సవిత తిరిగి ప్రారంభిస్తున్నారు. అన్న క్యాంటీన్ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News June 11, 2024

శ్రీకాకుళం జట్టుపై విశాఖ విజయం

image

టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్ 23 నార్త్ జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేయగా తదుపరి 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు 31.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటిరోజు విశాఖ జట్టు గెలుపొందింది. బుధవారం విజయనగరం-విశాఖ మధ్య మ్యాచ్ జరగనుంది.

News June 11, 2024

ఈనెల 14వ తేదీన కాకినాడలో జాబ్ మేళా

image

ఈ నెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. SSC, డిప్లమా, ఐటీఐ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 4 కంపెనీల్లో పని చేసేందుకు 818 మందిని ఎంపిక చేస్తారని తెలిపారు. 18- 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.

News June 11, 2024

SVU: రేపటి నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.