Andhra Pradesh

News June 11, 2024

నెల్లూరు: సీఎం ప్రమాణ స్వీకారానికి 32 ఆర్టీసీ బస్సులు

image

ఈనెల 12న విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు చొప్పున 32 బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు 17 ఎల్ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

News June 11, 2024

16న జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు

image

అనంతపురంలోని స్థానిక ఏరా ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 16న ఉదయం 9 గంటలకు జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ తెలిపారు. అండర్-10, 13, 15 విభాగాల్లో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న జిల్లా క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికైన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

News June 11, 2024

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై కొత్త ఆశలు

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.

News June 11, 2024

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై కొత్త ఆశలు

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.

News June 11, 2024

నాగార్జున యూనివర్సిటీలో వేసవి సెలవులు పొడిగింపు

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగించారు. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా.. విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కరుణ సోమవారం తెలిపారు. ఈనెల 14 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.

News June 11, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 15-18 గంటల సమయం పడుతోంది.. నిన్న శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,869 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ మంగళవారం వెల్లడించింది

News June 11, 2024

VZM: లోకం మాధవికి మంత్రి పదవి?

image

ఉమ్మడి విజయనగరం నుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు, తండ్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో అదితికి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బేబీనాయన, కోళ్ల లలితాకుమారి సహా పలువురు ఆశిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 21 స్థానాల్లో గెలుపొందిన జనసేన అభ్యర్థుల్లో లోకం మాధవి ఒక్కరే మహిళ కావడంతో ఆ పార్టీ కోటాలో ఆమెను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.

News June 11, 2024

తిరుపతి: త్వరలో ఆంక్షలు ఎత్తివేత

image

వ్యవసాయ సర్వీసుల జారీపై విధించిన ఆంక్షలు త్వరలో ఎత్తివేయనున్నట్లు విద్యుత్తుశాఖ తిరుపతి ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో నూతన వ్యవసాయ సర్వీసుల జారీ ప్రక్రియ నిలిపేశామని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలు సడలించి ఆన్‌లైన్‌లో నమోదుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

News June 11, 2024

కడప: డి ఫార్మసీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ విద్యలో భాగంగా ఉన్న డిప్లమో ఇన్ ఫార్మసీ (డి ఫార్మసీ) కోర్సు ప్రవేశానికి ఈ నెల 15వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్ తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు.

News June 11, 2024

గిద్దలూరు: పదిలో 530 మార్కులు.. అంతలోనే విషాదం

image

గిద్దలూరులో సోమవారం కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటోలో సప్లయర్స్ సామగ్రి తరలించి తిరిగి వెళ్తున్న క్రమంలో మోటర్ వైర్లు ఆటోకు తగిలాయి. దీంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ (18) దేశాయి కృష్ణ(16) అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కృష్ణ 530 మార్కులు సాధించాడు. లోహిత్ ఐటీఐ చదువుతున్నాడు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.