India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఎస్పీగా నిచికేత్ ఐపీఎస్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అశోక్ కుమార్‌ను ఎక్కడికి బదిలీ చేశారనేది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.
విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏ.ఆర్.దామోదర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దామోదర్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వకుల్ జిందాల్ గుంటూరుకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
తూర్పు గోదావరి జిల్లా డి.ఎస్.పి (హోంగార్డ్స్)గా పి. కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కిరణ్ కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శనివారం నియమితులయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న A.R దామోదర్‌ను విజయనగరంకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి SPగా పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ కాగా ఆమె స్థానంలో రాజాబాబు నియమితులై నేడే భాద్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లాను సమిష్ఠి కృషితో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు కలెక్టర్‌గా ఇది తన మొదటి పోస్టింగ్ అని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కోరారు. జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.
అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.
Sorry, no posts matched your criteria.