Andhra Pradesh

News June 11, 2024

రాయదుర్గం: రూ.50వేల నాణాలతో జంబుకేశ్వరుడి అలంకరణ

image

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో కనివిందు చేశారు. రూ.50వేలు విలువచేసే నాణేలతో స్వామి మూలవిరాట్‌ని అలంకరించారు. పురోహితుల రామకృష్ణ స్వామి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను దర్శించుటకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

News June 11, 2024

రాయచోటి: ‘బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం’

image

అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను
ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బాలకార్మికుల నిర్మూలనపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News June 11, 2024

నేడు విజయవాడలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం

image

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.

News June 11, 2024

మాజీ CM జగన్‌ను కలిసిన ప.గో. జిల్లానేతలు

image

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. 

News June 11, 2024

శ్రీకాకుళం: బీటెక్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 13, 14, 15, 18 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News June 11, 2024

నెల్లూరు: సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యాలయాల ముస్తాబు

image

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు పాటు అన్ని కార్యాలయాల ఎదుట విద్యుత్ కాంతులతో ఉండాలని సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయంల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.

News June 11, 2024

కోనసీమ: 3 రోజులు గరికపాటి ప్రవచనాలు

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ధర్మగుండం చెరువు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో మహ సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు సోమవారం తెలిపారు. శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.

News June 10, 2024

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి నూతన వాహనాలు

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి రెండు నూతన బొలెరో కార్లను ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సోమవారం విజయవాడలో వీటిని సంబంధిత సిబ్బందికి విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ అందచేశారు. డివిజన్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఈ ఏడాది మే నెల వరకు 61 మంది చిన్నారులను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించిందని నరేంద్రపాటిల్ తెలిపారు.

News June 10, 2024

విశాఖ: ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించాలని వినతి

image

విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ బట్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

News June 10, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి 17 ఎల్ఈడీ స్క్రీన్‌లు

image

విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్‌ మర్మత్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.