Andhra Pradesh

News June 10, 2024

విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

సౌత్ ఈస్ట్రన్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.

News June 10, 2024

కాశీలో కన్నుమూసిన వీరఘట్టం మహిళ

image

వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన లింగం సరోజిని(54) కాశీ యాత్రకు వెళ్లి ఆ దేవుని సన్నిదానంలో సోమవారం కన్నుమూశారు. ఈనెల 5న వీరఘట్టంకు చెందిన కొందరు మహిళలతో కాశి యాత్రకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి అయోధ్య, ప్రయోగరాజ్ తదితర యాత్రలు ముగించుకుని కాశీలో బస చేసిన హోటల్లో ఆమె మృతి చెందారు. కాశీలోని గంగానది ఒడ్డునే ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు వీరఘట్టం నుంచి బయలుదేరి వెళ్లారు.

News June 10, 2024

కడప జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కడప జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

News June 10, 2024

ప్రకాశం జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ప్రకాశం జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించింది. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

News June 10, 2024

విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతాం: ఎంపీ శ్రీభరత్

image

విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతామని MP శ్రీభరత్ హామీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయన.. ముందుగా తన తాత ఎం.వీ.వీ.ఎస్ మూర్తికి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తప్పు చేసిన YCP నాయకులు, కార్యకర్తలపై చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో YCP నాయకులు, కార్యకర్తలు చూశారని అన్నారు.

News June 10, 2024

పెనుకొండ: ఈతకు వెళ్లి యువకుడి మృతి

image

ఈతకోసం వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పెనుకొండ పట్టణానికి చెందిన సంతోశ్, స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోతున్నా యువకుడిని గమనించి అక్కడి వారు కాపాడటానికి ప్రయత్నించినప్పటికి అప్పటికే మృతి చెందారు. కియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

ప.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

తూ.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

చిత్తూరు: శునకానికి పదవీ విరమణ

image

డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్‌కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

News June 10, 2024

ఏలూరు: గోదావరిలో తల్లీకొడుకు గల్లంతు

image

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో విషాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటకు చెందిన పదిమంది సోమవారం మండలంలోని కట్కూరు శివాలయ దర్శనానికి వచ్చారు. అనంతరం గోదావరిలో స్నానం చేస్తుండగా తల్లి అల్లంశెట్టి నాగమణి, కొడుకు తేజ శ్రీనివాసులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.