Andhra Pradesh

News June 10, 2024

రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు సిక్కోలు జట్టు ఎంపిక

image

గుంటూరు జిల్లా బాపట్లలో ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు సోమవారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణ పర్యవేక్షణలో ఎంపికలు చేపట్టారు. రగ్బీ జిల్లా జట్టుకు బాలురు, బాలికలు కలిపి 24 మందిని ఎంపిక చేశారు.

News June 10, 2024

చిత్తూరు: ప్రేమజంట సూసైడ్.. పీటీఎంలో కేసు నమోదు

image

బత్తలపల్లె అడవిలో ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన ప్రేమజంట ఘటనపై పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు కేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం, దేవలచెరువు నరేంద్ర(25), రాణి(17) ప్రేమించుకున్నారు. బత్తలాపురం అడవికి వెళ్లి పురుగు తాగిన విషయం తెలిసిందే. ములకళచెరువు ఎస్‌ఐ వారిని మదనపల్లెకు తరలించగా ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పీటీఎం పరిధిలోకి వస్తుందని ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News June 10, 2024

కడప: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సామాజిక, సేవా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం అర్హులైన వారు జూలై 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు https://awards.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 10, 2024

చంద్రబాబు చూపు దామచర్ల వైపేనా ?

image

ఒంగోలు MLA దామచర్ల జనార్దన్‌కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా వచ్చిన జనార్దన్ TDP కష్టకాలంలో దశాబ్దం పాటు జిల్లా అధ్యకుడిగా పార్టీకి సేవలందించారు. అలాగే ఒంగోలులో మహానాడు, యువగళం కార్యక్రమాలు విజయవంతమవటానికి, అభ్యర్థుల గెలుపునకు తెరవెనుక కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమనే చర్చ నడుస్తోంది.

News June 10, 2024

అనంతగిరి: బొర్రా గుహలకు పెరిగిన సందర్శకుల తాకిడి

image

అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం మూడు వేల మంది బొర్రాగుహలను సందర్శించగా రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం నాలుగు వేల మంది బొర్రా గుహలను సందర్శించగా రూ.3.91 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే బొర్రా జిఫ్ లైన్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం రూ.1.16 లక్షల ఆదాయం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

News June 10, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కేంద్ర మంత్రులు వీరే 

image

రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గతంలో ఉద్దండులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. తాజా మంత్రి వర్గంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, పాములపాటి అంకినీడు ప్రసాద్, పనబాక లక్ష్మి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జేడీ శీలం, కొత్తపల్లి రఘురామయ్య జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా పని చేశారు.  

News June 10, 2024

కంచిలి సహకార సంఘం ఛైర్మన్ రాజీనామా

image

కంచిలి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గుమ్మడి రామదాసు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సహకార సంఘం అధికారులకు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా ఎన్నికైన రామదాసు.. ప్రస్తుతం కూటమి గెలవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో రాజీనామా అందజేసినట్లు ఆయన తెలిపారు.

News June 10, 2024

గుంటూరు: మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

image

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్‌ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా బాబాయ్‌ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

News June 10, 2024

విజయవాడ: మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

image

జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్‌ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

News June 10, 2024

VZM: ఈ నెల 16 నుంచి చేపల వేట ప్రారంభం

image

రెండు నెలలుగా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో విజయనగరం జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేటను నిషేధించిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించేందుకు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్ల మరమ్మతుల పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.