Andhra Pradesh

News June 10, 2024

చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

image

సోమందేపల్లి మండల కేంద్రంలోని బుసయ్యగారి పల్లికి చెందిన సోమశేఖర్ ఆదివారం మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమశేఖర్‌కు కొడుకు, కుమార్తె సంతానం ఉన్నారన్నారు. కుమార్తెకు ఈనెల 8న వివాహం నిశ్చయం కాగా.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో ఉరేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

News June 10, 2024

చిత్తూరు: 78 మంది స్వతంత్ర అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు

image

చిత్తూరు జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల దెబ్బకు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. చిత్తూరు లోక్ సభ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 17 మంది డిపాజిట్లు కోల్పోయారు. మరోవైపు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో 78 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రతి చోటా వైసీపీ, కూటమి నేతలు మినహా మిగిలినవారు డిపాజిట్లు కోల్పోయారు.

News June 10, 2024

ప.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

News June 10, 2024

తూ.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

News June 10, 2024

రాయచోటి: టీడీపీ నేతలపై దాడి.. వైసీపీ నేతలు అరెస్ట్

image

రాయచోటి మండలం బోయపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయులపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బోయపల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు, వైసీపీకి చెందిన వారు దాడి చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు దాడికి దిగిన 16 మంది వైసీపీ వర్గీయులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 10, 2024

రోలుగుంట: గోల్డ్ మెడల్స్ సాధించిన గవర్నమెంట్ టీచర్

image

గాజువాకలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రోలుగుంట ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పీవీఎం.నాగజ్యోతి 3 బంగారు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్‌లోని మూడు విభాగాలలో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వేట్ పాల్గొని మూడింటిలోనూ బంగారు పతకాలు సాధించారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.
ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె గతంలో అంతర్జాతీయ, జాతీయ మెడల్స్ సాధించారు.

News June 10, 2024

పర్చూరు: సబ్జెక్టులు మిగిలాయని యువకుడు సూసైడ్

image

పర్చూరు మండలం రామనాయపాలెం గ్రామానికి చెందిన వంశీకృష్ణ(24) చింతలపూడిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాడు. నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు మిగిలాయి. పరీక్షలు రాయడానికి రెండు రోజుల కిందట చింతలపూడి వచ్చాడు. ఆదివారం ఉదయం కాలేజీ సమీపంలోని ఒక పూరి గుడిసెలో ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్జెక్టులు ఉండటమే ఆత్మహత్యకు కారణమని వారు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News June 10, 2024

VZM: బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకున్నారు

image

ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్.కోట మం. వెంకటరమణ పేటకు చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్‌పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో అతనిపై దాడిచేశారు.

News June 10, 2024

ఆత్మకూరులో వైసీపీ పైలాన్ ధ్వంసం

image

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఇటీవల ఎంపీ విజయ సాయిరెడ్డి వైసీపీ పైలాన్‌ను ప్రారంభించారు. ఆ పైలాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే ఆత్మకూరులో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ధ్వంసం చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.

News June 10, 2024

జేఈఈలో అనంత కుర్రాళ్ల ప్రతిభ

image

JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో అనంత జిల్లా కుర్రాళ్లు మెరిశారు. అనంతకు చెందిన కుశాల్‌ కుమార్‌ 5వ ర్యాంకు, సాయి తేజేశ్‌ 54, సతీశ్‌ కుమార్‌రెడ్డి 175, సాయిగౌతమ్‌ 204, శశికిరణ్‌ 982వ ర్యాంకు సాధించారు. బీ.సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్‌రెడ్డి, ఎన్పీకుంటకు చెందిన సాయి దివ్యతేజరెడ్డి 175వ ర్యాంకులు సాధించారు. గాండ్లపెంట మండలం తాళ్లకాల్వకు చెందిన ముజమ్మిల్‌ 823 ర్యాంకు సాధించాడు.