Andhra Pradesh

News September 26, 2024

జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఇసుక నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ: కలెక్టర్

image

ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బుకింగ్ చేసుకున్న వెంట‌నే స‌రైన ర‌వాణాతో ఇసుక సరఫరా జరిగేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ జి.సృజ‌న‌ ఆదేశించారు. ఇసుక ర‌వాణా వాహ‌నదారులతో ప‌టిష్ఠ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు.

News September 26, 2024

నాయుడుపేటలో గంజాయి కలకలం

image

నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన వంతల వెంకట్రావును పట్టుకున్నట్లు సీఐ బాబి వెల్లడించారు. అతని బ్యాగులో నాలుగు కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే విషయాలపై విచారిస్తున్నట్లు తెలిపారు.

News September 26, 2024

ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

image

ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలిని సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల్లో నిర్లక్ష్యంతో బేబీ డెత్‌కు కారణమైనట్లు ఆరోపణలు రావడం, సహచర వైద్యులతో విభేదాలు తలెత్తి ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో నిన్న విచారణ చేపట్టిన జిల్లా వైద్యాధికారి మాధవి.. నేడు మైథిలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

అమరావతి: ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చంద్రబాబు సమీక్ష

image

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్‌ఎంఇ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

News September 26, 2024

బైరెడ్డిపల్లి: హార్ట్ ఎటాక్‌తో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

హార్ట్ ఎటాక్‌తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చలపతి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందినట్లు సహచర పోలీసు సిబ్బంది తెలియజేశారు. స్టేషన్‌లో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News September 26, 2024

ప.గో: కాలువలో దూకేసిన 9Thక్లాస్ విద్యార్థిని

image

ప.గో జిల్లా తణుకు మండలం కోనాలకు చెందిన ఓ విద్యార్థిని గురువారం వెంకయ్య వయ్యేరు కాలువలో దూకింది. ముద్దాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక.. ఓ ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి కాలువ సమీపంలో దిగింది. పరుగెత్తికెళ్లి కాలువ దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సదరు విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

తిరుమలకు జీడిపప్పు వాహనాన్ని ప్రారంభించిన మంత్రి

image

పవిత్ర టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీ కోసం గురువారం నుంచి నాణ్యమైన జీడిపప్పు పలాస నుంచి వెళ్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేలతో వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి జీడిపప్పు పంపిణీ చేస్తున్నామన్నారు.

News September 26, 2024

బాలినేని జనసేనలో చేరకముందే జిల్లాలో హీటెక్కిన రాజకీయం

image

బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరకముందే జిల్లాలో రాజకీయం హీటెక్కింది. <<14200095>>బాలినేని<<>>ని.. పవన్ ఎందుకు చేర్చుకుంటున్నారని దామచర్ల జనార్ధన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. బాలినేని ఇవాళ జనసేనలో చేరితే, రానున్న రోజుల్లో.. వీరిద్దరూ కూటమి ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో మున్ముందు జిల్లా రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని చర్చ జరుగుతోంది. దామచర్ల వ్యాఖ్యలపై మీ COMMENT.

News September 26, 2024

విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్‌లో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు కోరారు.

News September 26, 2024

కార్పొరేషన్ ఛైర్మన్లతో చంద్రబాబు సమీక్ష

image

నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదని, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు అని తెలిపారు.