Andhra Pradesh

News June 9, 2024

నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యేల రికార్డు

image

కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. 2009లో కోవూరు నుంచి టి.మునెమ్మ(PRP) పోటీ చేసి ఓడిపోగా ఈఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి గెలిచి తొలిమహిళా MLAగా రికార్డు తిరగరాశారు. అదేవిధంగా సూళ్లూరుపేటలో 2009లో వి.సరస్వతి(కాంగ్రెస్) పోటీ చేసి ఓడిపోగా.. ఈఎన్నికల్లో నెలవల విజయశ్రీ.. సంజీవయ్యపై గెలిచి తొలి మహిళా MLAగా రికార్డు సృష్టించారు.

News June 9, 2024

నరసాపురం MP భూపతిరాజు శ్రీనివాసవర్మ నేపథ్యం

image

భూపతిరాజు శ్రీనివాసవర్మ 1967లో భీమవరంలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణరాజు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఈయన BJYM జిల్లా అధ్యక్షుడు(1991-95), BJP ప.గో జిల్లా సెక్రెటరీ(1997-99), నరసాపురం పార్లమెంట్ కన్వీనర్(1999-2001), BJP నేషనల్ కౌన్సిలర్ మెంబర్(2001-03)గా చేశారు. 2009లో ఎంపీగా పోటీ, బీజేపీ ఉమ్మడి ప.గో జిల్లా అధ్యక్షుడు(2010-18), 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

News June 9, 2024

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదు: ఎస్పీ

image

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి పికెట్లు ఏర్పాటు చేసి మొబైల్ పార్టీలు తిప్పుతున్నామన్నారు. ముఖ్యమైన గ్రామాల్లో ఏపీఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపామని చెప్పారు. ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా FIR నమోదు చేస్తున్నామన్నారు. నాన్ కాగ్నిజబుల్ నేరమైనా కోర్టు అనుమతితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

News June 9, 2024

కోనసీమ: అంబేడ్కర్ విగ్రహానికి అవమానం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం బాలాంత్రం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రాసి చేతికి తగిలించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో హుటాహుటిన క్లూస్ టీంతో చేరుకొని పరిశీలిస్తున్నారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.

News June 9, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,557 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి శనివారం రూ.2.90 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం వెల్లడించింది

News June 9, 2024

లింగపాలెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

మండలంలోని బోగోలు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్‌గా స్థానికులు గుర్తించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

రికార్డు బ్రేక్ చేసిన దామచర్ల జనార్దన్

image

ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్లపై 32,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎన్నికల్లో అదే అత్యధిక రికార్డు. కానీ 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ బాలినేనిపై 34,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్లదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.

News June 9, 2024

కర్నూలు: ఎస్సార్ బీసీ కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఆదివారం పోలీసుల తెలిపిన వివరాలు.. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన మక్బుల్ బాషా(25) ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకోవడానికి పోలానికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ బీసీ కాలువలో పడింది. ఈ ఘటనలో మక్బుల్ కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News June 9, 2024

విగ్రహాలను తొలగించడం సమంజసం కాదు: ప్రియాంక దండి

image

రేపు అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

News June 9, 2024

నూజివీడులో సర్పంచ్ అనుమానాస్పద మృతి

image

మండలంలోని తూర్పు దిగవల్లి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..‌ సుమారు రూ.30 కోట్ల వరకు ఎన్నికల బెట్టింగ్ కట్టాడని, అనంతరం కనిపించకుండా పోయాడని అన్నారు. నేడు మల్బరీ షెడ్‌లో అనుమానస్పదస్థితిలో శవమై కనిపించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు అనుమానస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.