Andhra Pradesh

News June 9, 2024

వీరవాసరంలో యువతి మిస్సింగ్.. కేసు నమోదు

image

మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

News June 9, 2024

పెద్దిరెడ్డి విదేశాలకు పారిపోకుండా చూడాలి: MLA

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సత్యవేడు నియోజకవర్గంలో ఖనిజ సంపదను పెద్దిరెడ్డి దోచేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్టు రద్దు చేయాలి. ఆయన అవినీతిపైన ప్రశ్నించినందుకే నాకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు నన్ను అక్కున చేర్చుకుని టికెట్ ఇవ్వడంతో గెలిచాను’ అని ఆదిమూలం అన్నారు.

News June 9, 2024

ఉరవకొండ: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర గాయాలు

image

వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి చిన్న తాండలో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వజ్రకరూర్ నుంచి గ్రామానికి బైక్ పై వెళుతున్న తులసి నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా.. ఇరుపార్టీల వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 9, 2024

గుడివాడ: కొడాలి నాని ఇంటిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

image

మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడి గుడ్లు విసిరిన ఘటనలలో పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వారికి మధ్య జరిగిన వాగ్వాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించిన దర్శిత్, సత్యసాయి, తదితురులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

News June 9, 2024

మొగల్తూరు: మురుగు కాలువలో మృతదేహం లభ్యం

image

పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై శనివారం కేసు చేశామని ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొగల్తూరుకు చెందిన  పాపయ్య(47) ఆ గ్రామానికి చెందిన ఓ రైతుకు మంగళగుంటపాలెంలో ఉన్న చెరువులో పని చేసేందుకు ఈ నెల 6న వెళ్లారు. ఆ రోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా.. మంగళగుంటపాలెం సమీపంలోని మురుగు కాలువలో ఈ నెల 8న మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. 

News June 9, 2024

కాకినాడ ఎంపీ టీటైమ్ ఉదయ్‌కి కేంద్ర మంత్రి పదవి?

image

ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనకు ఒక కేబినెట్ పదవి ఇచ్చే వీలుంది. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌కి కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమైనట్టు ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జిల్లా ప్రజలంతా ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. ఆయన ద్వారా కాకినాడ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు.

News June 9, 2024

ప.గో: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ పరీక్షలు

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య అనుబంధ పరీక్షలు(ఓపెన్ పరీక్షలు) ముగిశాయి. శనివారం నిర్వహించిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 210కి 194 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారని డీఈవో నాగమణి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షకు మొత్తం 713కి 644 మంది హాజరై 69 మంది హాజరు కాగా గైర్హాజరయ్యారు. 90.32 శాతం మంది విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు.

News June 9, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

image

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) అనే ఖైదీ మృతి చెందాడు. శనివారం రాత్రి ఖైదీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News June 9, 2024

కడప జిల్లా నేతల్లో మంత్రి పదవి ఎవరికి.?

image

ఉమ్మడి కడప జిల్లా నుంచి పది స్థానాల్లో ఏడింటిని కూటమి సొంతం చేసుకుంది. ఇక అనకాపల్లి, ఏలూరు ఎంపీలుగా సీఎం రమేశ్, పుట్టా మహేశ్ యాదవ్ గెలిచారు. ధర్మవరం ఎమ్మెల్యేగా జిల్లా వాసి సత్య కుమార్ గెలిచారు. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గంలో మన వారి పేర్లే వినపడుతున్నాయి. దీంతో జిల్లా నుంచి ఎవరికి కేంద్ర, రాష్ట్ర పదవులు వస్తాయో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు నేతలు అధిష్ఠానాలతో మంతనాలు సాగిస్తున్నారు.

News June 9, 2024

భీమవరం: అపార్ట్ మెంట్‌లో చోరీ.. కేసు నమోదు

image

పట్టణ పరిధిలో బలుమూరిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో చోరీ జరిగింది. సీఐ  శ్రీనివాసు కథనం ప్రకారం.. స్థానిక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మాలతి తన కుమారుడిని ఇంజినీరింగ్ కళాశాలలో చేర్చేందుకు ఈ నెల 1న హైదరాబాద్ వెళ్లారు. 6న తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో ఉంచిన 144 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.