Andhra Pradesh

News June 9, 2024

NTR జిల్లాలో మంత్రి పదవి ఎవరికి.?

image

తాజా ఎన్నికల్లో NTR జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP అభ్యర్థులు గెలిచారు. త్వరలో చంద్రబాబు CMగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో NTR నుంచి మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జరుగుతోంది. బొండా ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య ముందువరుసలో ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అనకుంటున్నారో COMMENT చేయండి.

News June 9, 2024

SKLM: వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఫిర్యాదు

image

టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుంకరి గురువులుపై అదే గ్రామానికి చెందిన మక్క ఈశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు శనివారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో జరిగిన ఒక విషయంలో తాజాగా మాటా మాటా పెరగడంతో గురువులుపై దాడి చేసినట్లు అందులో  పేర్కొన్నాడు. ఘటనపై టెక్కలి ఎస్ఐ లక్ష్మీ కేసు నమోదు చేశారు.

News June 9, 2024

ఎచ్చెర్ల: సజావుగా ఏపీ ఎడ్ సెట్ పరీక్షలు

image

జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఏపీ ఎడ్ సెట్ -2024 పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా నుంచి 992 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 876 మంది హాజరయ్యారు. 116 మంది గైర్హాజరయ్యారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్ పరీక్ష కేంద్రంలో 330 మందికి 295 మంది, టెక్కలి ఐతం కళాశాలలో 302 మందికి 278 మంది, చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కాలేజీలో 180 మందికి 153 మంది, వెంకటేశ్వరలో 180మందికి 150మంది హాజరయ్యారు.

News June 9, 2024

మొదలైన పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర

image

అల్లూరి ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మోదకొండమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శతకం పట్టు వద్దకు ఘటాలను ఊరేగింపుగా తరలించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News June 9, 2024

నెల్లూరు: కూటమికి 63.72 శాతం పోస్టల్ బ్యాలెట్

image

తాజా ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూటమికి 15,431(63.72) మంది ఉద్యోగులు ఓట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెత్తం 24,216 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వారిలో కేవలం 5,925(24.47) మంది మాత్రమే వైసీపీకి ఓటు వేశారు. మరోవైపు ఇండియా కూటమికి 1,580(6.52) మంది ఓటు వేశారు. కాగా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

News June 9, 2024

నాడు ఈనాడు జర్నలిస్టు.. నేడు విజయనగరం ఎంపీ

image

1995 నుంచి 2000 వరకు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. నేడు విజయగనం ఎంపీ అయ్యారు. ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను ఎంపీగా ఎదగడానికి రామోజీరావే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. జీవిత పాఠాలు నేర్పిన ఆయన ఇక లేరన్న విషయం కలిచివేసిందన్నారు. జీవితాంతం రామోజీరావుకు రుణపడి ఉంటానన్న కలిశెట్టి.. రామోజీరావును తలుచుకున్న ప్రతిసారీ కన్నీరు వస్తుందన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News June 9, 2024

రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

image

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌ శోభారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ఆమె రూ. 21,53,110వరకు నగదు అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపించిన ఉన్నతాధికారులు శోభారాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకున్నారు.

News June 9, 2024

ప.గో జిల్లాలో కూటమికే జై కొట్టిన ఉద్యోగులు

image

ప.గో లోక్‌సభ స్థానంలో15,165 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 8,707(57..41%) ఓట్లు కూటమికి పడ్డాయి. వైసీపీకి 5,176(33.13%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 1,006(6..63%) మంది మాత్రమే ఓటు వేశారు.

News June 9, 2024

విజయనగరంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.

News June 9, 2024

కృష్ణా జిల్లాలో మంత్రి పదవి ఎవరికి.?

image

తాజా ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP అభ్యర్థులు గెలిచారు. త్వరలో చంద్రబాబు CMగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో కృష్ణా నుంచి మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జరుగుతోంది. కొల్లు రవీంద్ర, వెనిగండ్ల రాము, జనసేన నుంచి మండలి బుద్దప్రసాద్, ముందువరుసలో ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అనకుంటున్నారో COMMENT చేయండి.