Andhra Pradesh

News September 26, 2024

విజయవాడ: దసరా ఉత్సవాలకు 964 ప్రత్యేక బస్సులు

image

దసరా ఉత్సవాలకు విజయవాడకు వచ్చేవారి కోసం 964 ప్రత్యేక బస్సులు నడుపుతామని APSRTC తెలిపింది. ఈ బస్సులను అక్టోబర్ 3- 15 వరకు 13 రోజులపాటు నడుపుతామంది. అదే సమయాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నందున HYD నుంచి విజయవాడకు బస్సులలో 353 సర్వీసులు నడుపుతామని తెలిపింది. రాజమండ్రి రూట్లో 241, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేందుకు మిగతా బస్సులు నడుపుతామని RTC తెలిపింది.

News September 26, 2024

అమెరికా పర్యటనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆ సంఘం ఆహ్వానం మేరకు ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వాషింగ్టన్ డీసీలోని లీస్బర్గ్ నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారు. తిరిగి అక్టోబరు 8న రాష్ట్రానికి చేరుకుంటారు.

News September 26, 2024

కృష్ణా: నేటి ముగియనున్న ఆన్‌లైన్ దరఖాస్తు గడువు

image

2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గుడివాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎల్.గౌరీమణి తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

News September 26, 2024

ప్రకాశం: కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు

image

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి. సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో రూ.250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.

News September 26, 2024

తిరుమల శ్రీవారికి నేటి నుంచి పలాస జీడిపప్పు

image

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి పలాస ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉన్న జీడి పరిశ్రమ నుంచి జీడిపప్పు గురువారం తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే గౌతు శిరీషా జీడిపప్పు కంటైనర్‌కు జెండా ఊపి ప్రారంభించనున్నారు. సుమారు 40 సంవత్సరాల తర్వాత పలాస నుంచి శ్రీనివాసుని చెంతకు జీడిపప్పు రవాణా కానుందని వారు తెలిపారు.

News September 26, 2024

విశాఖలో హర్షసాయి బంధువులను విచారించిన పోలీసులు?

image

హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిన్న విశాఖలో HYD పోలీసులు హర్షసాయి బంధువులను విచారించినట్లు సమాచారం. అయితే అతను విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.

News September 26, 2024

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణకు అస్వస్థత

image

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని సమాచారం. గురువారం తెల్లవారుజామున రాధాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషనలో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

News September 26, 2024

విజయవాడలో హర్షసాయి ?

image

హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా హర్షసాయి విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.

News September 26, 2024

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తలు రద్దీ కొనసాగుతోంది. ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న స్వామి వారిని 77,939 మంది దర్శించుకున్నారు.

News September 26, 2024

న్యూయార్క్‌లో మంత్రి పర్యటన.. ప్రముఖులతో భేటీ

image

న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్, షెల్ ఫౌండేషన్ సీఈఓ జోనాథన్ బెర్మాన్, పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరదలు, కరువు నివారణ చర్యలు, సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు.