Andhra Pradesh

News September 13, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా మధురై(MDU), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ 06059 MDU- BJU ట్రైన్‌ను SEPT 17- NOV 26 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. నం.06060 BJU- MDU ట్రైన్‌ను SEPT 20-NOV 29 వరకు ప్రతి శనివారం సేవలు అందిస్తుందన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 13, 2025

నెల్లూరులో యువతి దారుణ హత్య!

image

నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురు ఇంట్లో ఉంటూ చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యువతి వెళ్లింది. ఈ క్రమంలో యువతిని పొడిచి చంపిన యువకుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2025

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

image

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News September 13, 2025

‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

image

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.

News September 13, 2025

గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

News September 13, 2025

రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

image

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2025

ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

image

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

News September 13, 2025

సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకుపోకుండా ఈ ఏడాది జిల్లాలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్లు డీఈవో శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుర్నూలు జిల్లాలో ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హాస్టళ్లు నిర్వహించేందుకు ఆసక్తి ఉండి, సేవాభావం కలిగిన పొదుపు, ఎన్జీవో సంఘాలు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 13, 2025

వర్జీనియా పొగాకు ధర అధరహో

image

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 13, 2025

ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

image

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.