Andhra Pradesh

News June 7, 2024

చిత్తూరు: ఏడు నియోజకవర్గాల్లోనూ అతనిదే హవా..!

image

చిత్తూరు MP అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యం చూపలేకపోయారు. చంద్రగిరిలో1,43,841 ,నగరిలో 1,01,839, జీడీనెల్లూరులో 96, 883, చిత్తూరులో 85,414, పూతలపట్టులో 98,985, పలమనేరులో 1,20,273, కుప్పంలో 1,18,301, కుప్పంలో 1,18,301 ఓట్లు దక్కించుకున్నారు.

News June 7, 2024

విశాఖ పోర్టుకు 18వ స్థానం

image

ప్రపంచ బ్యాంకు రూపొందించిన కంటైనర్ పోర్టు పనితీరు ఇండెక్స్‌లో విశాఖ పోర్టు 18వ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ ఈ నూతన మైలురాయిని చేరుకోవడంలో ప్రతిభ కనబరిచింది. ఈ ఘనతను రైల్వే, కస్టమ్స్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అభినందించాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి.

News June 7, 2024

కడప: షర్మిల ఎదురెళితే పార్టీ ఓడినట్లే?

image

YS వారసులుగా రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్, షర్మిల తమ మార్క్ చూపిస్తున్నారు. జగన్ YCPని స్థాపించి సీఎం అయ్యారు. ఇక షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టి ప్రత్యర్థులకు విమర్శలు సందిస్తూ ఆ పార్టీలే ఓడేలా చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఆమె గెలవకపోయినా నైతికంగా గెలిచారంటున్నారు. 2019లో TDP, 2024లో తెలంగాణాలో BRS, APలో YCP పార్టీలకు ఎదురెళ్లి ఓడించారని షర్మిల అభిమానులు సోషియల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

News June 7, 2024

అనంత: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ముగ్గురు మహిళలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. శింగనమల నుంచి బండారు శ్రావణి శ్రీ, పెనుకొండ నుంచి సవిత, పుట్టపర్తి నుంచి పల్లె సింధూరరెడ్డి, రాప్తాడు పరిటాల సునీత గెలుపొందారు. కాగా వీరిలో పరిటాల సునీత మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం ఇదే మెదటిసారి కావడం గమనర్హం. వారిలో పల్లె సింధూరరెడ్డి, సవిత మెుదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు.

News June 7, 2024

ప్రకాశం జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫలితాల్లో TDP పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 12 నియోజకవర్గ స్థానాల్లో పదింటిలో TDP జెండా ఎగరేసింది. ఇప్పుడు జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనేదే చర్చ. గొట్టిపాటి రవి 5 సార్లు MLA కాగా, ఈసారి మంత్రి పదవి ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి సామాజికవర్గాల వారిగా పరిశీలించి చంద్రబాబు ఎవరిని కేబినేట్‌లోకి చేర్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

News June 7, 2024

ఏలూరు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

image

నూజివీడులో నిన్న <<13390710>>కత్తిపోట్ల<<>> ఘటన కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు..నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయికిరణ్, సుధీర్‌ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్‌ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.

News June 7, 2024

విశాఖ: వందే భారత్ రైళ్లకు మంచి స్పందన

image

విశాఖ నుంచి నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ, విశాఖ-భువనేశ్వర్-విశాఖ మధ్య మొత్తం మూడు వందే భారత్ రైళ్లు ప్రతిరోజు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తయారైన ఈ రైళ్లలో మధ్యతరగతి ప్రయాణికులు సైతం ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 7, 2024

విశాఖ మేయర్ పీఠంపై కూటమి గురి..?

image

విశాఖ నగరం మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. GVMCలో 98 స్థానాలకు ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో TDPకి 29, జనసేనకి 3, BJP, CPM, CPIలకు ఒక్కొక్కరు, 5 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా 57 మంది YCP కార్పొరేటర్లు. YCPలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది.

News June 7, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప ‘నోటా‘ ఓట్లు.. మన కర్నూలుకే

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోనే కర్నూలు అసెంబ్లీ స్థానంలో ‘నోటా’(పై వారెవరూ కాదు)కు తక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన స్థానాల్లో కేవలం 718 ఓట్లతో కర్నూలు అసెంబ్లీ రెండో స్థానంలో నిలిచింది. కాగా విశాఖ దక్షిణం 631 ఓట్లతో మెుదటి స్థానంలో ఉంది.

News June 7, 2024

YCP మాజీ MLA ఆర్కే స్వగ్రామంలో TDPకి మెజారిటీ

image

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.