Andhra Pradesh

News June 7, 2024

విజయనగరంలో 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 1994లో జరిగిన ఎన్నికల్లో నాగూరు, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తెర్లాం, గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, సతివాడ, భోగాపురం, ఉత్తరావల్లి, ఎస్.కోటలో టీడీపీ అభ్యర్థులు గెలిపొందారు. నాగూరు, సతివాడ నియోజకర్గాలు కురుపాం, సతివాడగా మారగా.. తెర్లాం, భోగాపురం, ఉత్తరావల్లి నియోజకర్గాలు పునర్విభజనలో రద్దయ్యాయి.

News June 7, 2024

హొలగుంద: టీబీ డ్యాంకు పెరిగిన ఇన్ ఫ్లో

image

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో గురువారం పెరుగుతోంది. బుధవారం ఇన్ ఫ్లో 517 క్యూసెక్కులు ఉండగా గురువారం 1,670 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 3.706 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 10 క్యూసెక్కులు (అవుట్లో ) రాయబసవన కెనాల్‌కు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 5.029 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు.

News June 7, 2024

అవినీతి సొమ్ముని కక్కిస్తా: కడప ఎమ్మెల్యే

image

కడప అభివృద్ధికి అంజాద్ బాషా వెచ్చించానని చెబుతున్న రూ.2 వేల కోట్లకు లెక్క తేల్చాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో తిన్న అవినీతి సొమ్ముని కక్కించి, కబ్జా చేసిన పేదల భూములను పేదలకు పంచి పెడతానన్నారు. ఎన్నికలకు ముందు జగన్ కడపలో తన ముఖం చూసి ఓట్లు వేయమన్నారని.. ఇక్కడ అంజాద్ బాషాను ఓడించామంటే జగన్‌ను ఓడించినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ జెండా ఎగరేశామన్నారు.

News June 7, 2024

పవన్‌పై తమన్నా సింహాద్రి పోటీ.. ఓట్లు ఎన్నంటే..?

image

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు 247 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసిన 13 మందిలో ఈమెకు వచ్చిన ఓట్లే అతి తక్కువ. ఇక పవన్‌ 1,34,394 ఓట్లు సాధించి.. 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 7, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాలు విడుదల

image

డా.బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ ఫలితాలను డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో 10,822 మంది విద్యార్థులకు 5,316 మంది ఉత్తీర్ణత (49.12శాతం) సాధించారని తెలిపారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్ సైట్‌లో పొందుపరిచామని, పునఃమూల్యాంకనం కొరకు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News June 7, 2024

మార్టూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మార్టూరులోని శ్రీవిగ్నేశ్వర కూరగాయల మార్కెట్ సమీపంలోని తండాలో నివాసం ఉంటున్న మూడావత్ బాలనాయక్ (60) అనుమానాస్పదంగా గురువారం మృతి చెందాడు. బాలనాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటూ వైసీపీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేయడం వల్లే కక్ష్యతో బాలనాయక్‌ను హత్య చేసి వేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 7, 2024

విశాఖ: మత్తు పదార్థాలతో ఇద్దరు అరెస్ట్

image

ఎండీఎంఏ(మిథైలెన్డియోక్సి మెథాంపేటమిన్) డ్రగ్‌ను కలిగి ఉన్న ఇద్దరు యువకులను మహారాణిపేట పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 3.316 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. టర్నల్ చౌల్ట్రీ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎం.సాయిరాం, టీ.సంగ్రామ్ సాగులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి.

News June 7, 2024

నెల్లూరు జిల్లాలో NOTAకి పడిన ఓట్లు ఇవే..!

image

➤ నెల్లూరు సిటీ: 967
➤ కోవూరు: 2,377
➤ కావలి: 2,030
➤ ఆత్మకూరు: 2,347
➤ నెల్లూరు రూరల్: 2,016
➤ ఉదయగిరి: 2,072
➤ వెంకటగిరి: 3,037 ➤ గూడూరు: 3,129
➤ సూళ్లూరుపేట: 3,423 ➤ సర్వేపల్లి: 2,057
➤ మొత్తం: 23,455

News June 7, 2024

ఏలూరు: LOVERతో కలిసి భర్తను చంపేసి

image

లింగపాలెం మండలం వేములపల్లికి చెందిన చట్టిమాల ఆశీర్వాదం(34) JCB డ్రైవర్. భార్య సుమలత పెదవేగి మండలం కొప్పాకకు చెందిన నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ప్రియుడితో కలిసి ఉరేసి చంపింది. అతడే ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌‌లో ప్రియుడితో ఉన్న ఫొటోలు బయటకు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్యచేసినట్లు ఒప్పుకోగా కేసు నమోదైంది.

News June 7, 2024

చిత్తూరు: పెద్దిరెడ్డితో కమిటీ ఏర్పాటు

image

దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.