Andhra Pradesh

News June 7, 2024

తుంగభద్ర జలాశయానికి భారీగా నీరు

image

ఆలూరు నియోజకవర్గ పరిధి లోని తుంగభద్ర జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు అడుగంటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా.. 3.373 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1,633.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,577. 49 అడుగులు ఉన్నాయి. తుంగభద్ర డ్యాం కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు రోజురోజుకు పెరుగుతుంది.

News June 7, 2024

తిరుపతి: ముఖేష్ కుమార్ మీనాకి సాదర స్వాగతం

image

రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు తిరుపతిలో సాదర స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ముఖేష్ కుమార్ మీనాకి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. తిరుపతిలో విశ్రాంతి అనంతరం తిరుమలకు చేరుకొని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News June 7, 2024

మార్కెట్లో విచ్చలవిడిగా ఎక్స్‌పైర్ డేట్ శీతల పానీయాలు

image

చేజర్ల మండలంలోని పలు దుకాణాల్లో ఓ కంపెనీకి చెందిన ఎక్స్‌పైర్ డేట్ శీతల పానీయాలు తరచూ కనిపిస్తున్నాయి. గురువారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఓ దుకాణంలో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన మాజా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిందని గమనించారు. ఇటీవల పొదలకూరులో కూడా వెలుగు చూశాయి. దీంతో అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News June 7, 2024

విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్

image

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.

News June 7, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల కోడ్ నిలుపుదల: ఢిల్లీ రావు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News June 6, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న రీవాల్యుయేషన్ దరఖాస్తు గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు(సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

పార్వతీపురం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

వెంకంపేట పంచాయితీ YKMనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న పల్లా సింహాచలం (39) అనే యువకుడు ఇంట్లో భార్య బిడ్డలు లేని సమయంలో గురువారం ఉదయం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి కారణం ఆర్థికంగా ఇబ్బందులు అని బంధువులు చెబుతున్నారు. ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 6, 2024

అండర్ 19 క్రికెట్ జట్టుకు ధర్మవరం బాలికలు ఎంపిక

image

ధర్మవరం పట్టణానికి చెందిన నాగజ్యోతి, తేజ్ దీపిక అనే బాలికలు అండర్ 19 అనంతపురం జిల్లా జట్టుకు ఎంపికైనట్లు క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ధర్మవరం కళాశాల మైదానంలో బాలికలు ఇద్దరినీ ఆయన అభినందించారు. జూన్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెంకటగిరిలో జరిగే అండర్ 19 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో వీరు పాల్గొంటారని కోచ్ పేర్కొన్నారు.

News June 6, 2024

అలిపిరి బస్టాండు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

తిరుపతిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ గుంతలో పడి మృతి చెందినట్లు అలిపిరి SI రామస్వామి తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కోసం తీసిన గోతిలో పడ్డాడు. ఎవరు చూడకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రుయాలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 6, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం: ఢిల్లీరావు

image

ప్రశాంత వాతావరణంలో నిర్వ‌హించ‌డంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు. నేడు విజయవాడలో అధికారుల‌తో స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిబద్దతతో వ్యవహరిస్తూ.. విధులు నిర్వర్తించారని తెలిపారు. అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.