Andhra Pradesh

News June 6, 2024

శ్రీకాకుళం: ఓకే నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ

image

ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు గెలుపొందడంతో అక్కడ ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒకే నియోజకవర్గానికి చెందినవారు. ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేశారు.

News June 6, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న రీ వాల్యుయేషన్ గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా, పీజీ కోర్సుల పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు శుక్రవారంలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

నెల్లూరు: మంత్రి పదవి ఎవరికి.. జోరుగా ప్రచారం

image

నెల్లూరు జిల్లాలో టీడీపీ పదికి పది స్థానాలు దక్కించుకుంది. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా నారాయణ, ఇరిగేషన్ మంత్రిగా ఆనం, వ్యవసాయ మంత్రిగా సోమిరెడ్డి పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

News June 6, 2024

దేవీపట్నం: నడిరోడ్డుపై తల్లి, బిడ్డను వదిలేశారు

image

దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జోగమ్మ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రసవించింది. వైద్యసేవల అనంతరం తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో అకూరు గ్రామం వద్ద రోడ్డుపై వదిలి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించి ఆటోపై ఆమె చింతలగూడెం గ్రామానికి వెళ్లారు.

News June 6, 2024

బాపట్ల జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం: కలెక్టర్, ఎస్పీ

image

బాపట్ల జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ రకుల్ జిందాల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఇరువురు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన అధికారులకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నిధులు చెల్లించడం జరిగిందన్నారు.

News June 6, 2024

చంద్రబాబు మంత్రివర్గంలోకి వెనిగండ్ల రాము.?

image

గుడివాడ గడ్డపై TDP జెండాను మళ్లీ రెపరెపలాడించిన వెనిగండ్ల రాముకి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. TDP నుంచి YCPలోకి వెళ్లిన కొడాలి నానికి ధీటుగా నిలిచిన వెనిగండ్ల 53వేల మెజార్టీతో గుడివాడను చంద్రబాబుకు కానుకగా సమర్పించారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. NRI అయిన రాము విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడంలో సహాయపడతారని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.

News June 6, 2024

ముత్తుములను గెలిపించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అత్యధికులు ఈసారి TDPకే వేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆ ఓట్లే TDPని గెలిపించాయి. ఇక్కడ ముత్తుముల అశోక్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 973 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గిద్దలూరు నియోజకవర్గంలో చెల్లుబాటు అయిన ఓట్లు 3,449. అందులో TDP అభ్యర్థికి 2,271రాగా, YCPకి 1,130 ఓట్లు వచ్చయి. దీంతో అశోక్ రెడ్డి గెలుపులో ఓట్లు కీలకం అయ్యాయి.

News June 6, 2024

విశాఖ: మిగులు సీట్లు భర్తీకి నోటిఫికేషన్

image

విశాఖపట్నం జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. 6,7,8,9 తరగతులలో మిగిలిన సీట్లు కొరకు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సీట్లు వివరాలు, పరీక్ష విధివిధానాలు సంస్థ వెబ్సైట్లో సరిచూసుకోవాలన్నారు.

News June 6, 2024

మచిలీపట్నం లోక్‌సభ ఎన్నికలలో 4వ స్థానంలో NOTA

image

మచిలీపట్నం లోక్‌సభకు జరిగిన తాజా ఎన్నికలలో NOTAకు మొత్తం 12,126 ఓట్లు పడ్డాయి. వీటిలో EVMలలో 12,008, పోస్టల్ బ్యాలెట్లలో 1,18 ఓట్లు పడ్డాయి. కాగా పోటీ చేసిన 15 మంది అభ్యర్థులలో విజేతగా నిలిచిన బాలశౌరి(జనసేన), చంద్రశేఖర్(వైసీపీ), గొల్లు కృష్ణ(కాంగ్రెస్) తర్వాత NOTAకు అత్యధికంగా ఓట్లు పడటంతో NOTA 4వ స్థానంలో నిలిచింది.

News June 6, 2024

ఉమ్మడి జిల్లాలో టీడీపీ జయకేతనం: సోమిశెట్టి

image

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం మహానంది ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం వేద పండితులు ఆయనకు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి విజయకేతనం ఎగురవేసింది అని హర్షం వ్యక్తం చేశారు.