Andhra Pradesh

News June 6, 2024

విజయనగరం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్‌పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.

News June 6, 2024

తూ.గో. ప్రజలు తీర్పు ఏదిస్తే అదే అధికారంలో

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం దశాబ్దాల ఆనవాయితీ. తాజా ఎన్నికల్లోనూ అదే నిజమైంది. 1952 నుంచి 2019 వరకు అధికారం చేపట్టిన పార్టీలన్నీ తూ.గో.లో అత్యధిక స్థానాలు దక్కించుకున్నవే. ఇక 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి తూ.గో.లో పోటీ చేయగా.. అప్పుడు 21 స్థానాల్లో ప్రతిపక్షాలకు ఒక్కసీటు దక్కకుండా టీడీపీకే పట్టం కట్టారు.

News June 6, 2024

కర్నూలు: ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల

image

రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్)కు సంబంధించిన ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. ఫలితాలు www.bse.ao.gov.inలో తెలుసు కోవచ్చునని పేర్కొన్నారు. జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం ఎంపికైన విద్యార్థులు వెంటనే బ్యాంకులో విద్యార్థి పేరున సేవింగ్స్ ఖాతా తీసుకుని తండ్రి/తల్లి జాయింట్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News June 6, 2024

కడప కంచుకోటలు బద్దలు కొట్టిన TDP

image

ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి కడప జిల్లాపై TDP పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కూటమిగా ఏర్పడి 7 స్థానాలు గెలిచింది. YCP ఆవిర్భవం నుంచి ఉమ్మడి జిల్లాపై జగన్ పూర్తి పట్టు సాధించారు. అందుకు తగ్గట్టుగానే 2014, 19 ఎన్నికల్లో అదే విధంగా సీట్లను గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో YCP కంచుకోటలైన RCT, KMP, PDTR, మైదుకూరు, కోడూరు, కడప, జమ్మలమడుగు స్థానాల్లో కూటమి జయకేతనం వేసింది. దీంతో YCP ఆత్మ సంరక్షణలో పడింది.

News June 6, 2024

విజయనగరం ప్రజల తీర్పుపై మీ కామెంట్?

image

ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం ప్రజల తీర్పు చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లోనూ YCP అభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. ఈసారి రివర్స్ తీర్పు ఇచ్చారు. కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. గెలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గానికి కావాల్సిన నిధులపై అసెంబ్లీలో చర్చిస్తారు. కాకపోతే జిల్లాలో అభివృద్ధి, సమస్యలపై ప్రస్తావించేందుకు ప్రతిపక్షపాత్ర పోషించే నేత అప్పుడూ.. ఇప్పుడూ లేకపోవడం గమనార్హం.

News June 6, 2024

ప.గో.: బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందినట్లు ఆకివీడు ఎస్సై బత్తిన నాగరాజు బుధవారం తెలిపారు. ఆకివీడు శివారులోని ఉప్పుటేరు వద్ద ఏలూరు నుంచి వస్తున్న బస్సు కైకలూరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చిప్పల నాగరాజును ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

News June 6, 2024

తాడేపల్లి: లోకేశ్‌ను కలిసిన అచ్చెన్నాయుడు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా అచ్చెన్నాయుడు కలిశారు. గురువారం తాడేపల్లి (M) ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవటం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

News June 6, 2024

ప.గో.: NOTAకు 34,003 ఓట్లు

image

ఉమ్మడి. ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 34,003 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా పోలవరంలో, అత్యల్పంగా పాలకొల్లులో వచ్చాయి.
☛ పోలవరం -5611 ☛ గోపాలపురం -4500
☛ చింతలపూడి -4121 ☛కొవ్వూరు -2465
☛ నిడదవోలు -2144 ☛ఉంగుటూరు -2105
☛ దెందులూరు -1920 ☛ తణుకు -1722
☛ ఆచంట -1673 ☛ ఉండి -1607
☛ తాడేపల్లిగూడెం -1534 ☛ ఏలూరు -1256
☛ నరసాపురం -1216 ☛ భీమవరం -1210
☛పాలకొల్లు – 919

News June 6, 2024

తాడేపల్లి: చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు

image

తాజా ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్న చంద్రబాబుకు పోలీసులు భద్రతను పెంచారు. తాడేపల్లి (M) ఉండవల్లి గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తూ భద్రతను మరింత పెంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

News June 6, 2024

పవన్‌ కళ్యాణ్‌పై 9 డిగ్రీలు చేసిన వ్యక్తి.. ఓట్లెన్నో తెలుసా..?

image

పిఠాపురంలో పవన్‌పై పోటీగా జైభీమ్ భారత్ పార్టీ తరఫున 9 డిగ్రీలు చేసిన జగ్గారపు మల్లికార్జున రావు MLAగా బరిలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పోటీలో నిలిచిన మల్లికార్జున రావుకు కేవలం 594 ఓట్లు రాగా 6వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.