Andhra Pradesh

News January 24, 2026

కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

జనవరి 26న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News January 24, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.16,210
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,913
* వెండి 10 గ్రాములు ధర రూ.3,430.

News January 24, 2026

రూ.1,417 కోట్ల చెక్‌ అందజేసిన CM

image

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 12,932 మహిళా సంఘాలకు రూ.1,417 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల మెగా చెక్‌ను సభ్యులకు శనివారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

News January 24, 2026

ఎస్కేయూ బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంచార్జ్ ఉపకులపతి అనిత తన చాంబర్‌లో వీటిని ప్రకటించారు. మొత్తం 722 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 670 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 92.80గా నమోదైందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రొఫెసర్ జివి రమణ, శ్రీరామ్ నాయక్ పాల్గొన్నారు.

News January 24, 2026

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన DGP

image

అమరావతి ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డాక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ఆ ప్రాంతంలో ప్రాక్టీస్ పెరేడ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర విషయాల గురించి స్థానిక అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News January 24, 2026

SKLM: నేటి సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు..!

image

రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం నాటి వివరాలు ఇలా…
*సాయంత్రం 6.గం లకు తన్మయి శాస్త్రీయ నృత్యం, గణపతి శర్మ, యామిని కర్రిల మ్యూజికల్ షోలు,
రాత్రి 7:00 నుంచి థమన్ లైవ్ కాన్సర్ట్, ఢీ డాన్సర్స్ ఆక్సా ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు,* సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, చంద్రికలు యాంకర్లుగా, డ్రోన్ షో కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

News January 24, 2026

రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

image

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

News January 24, 2026

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సరి సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ‘జీరో- గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ అనే థీమ్‌తో ర్యాలీనీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్కలను నాటారు.

News January 24, 2026

చిత్తూరు: వేతనం చెల్లించకపోతే కాల్ చేయండి

image

ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతం వీబీజీ- రామ్ జీగా మార్చిన సంగతి తెలిసిందే. కూలీలకు వేతనం చెల్లించకపోయినా, పని ప్రదేశంలో వసతులు లేక పోయినా, జాబ్ కార్డుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. 1800 2001 001 టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సమస్యలపై ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News January 24, 2026

ఆమదాలవలస మహిళకు జిల్లా బాధ్యతలు

image

వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఆమదాలవలసకు చెందిన అజంత కుమారిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకంలో భాగంగా అజంతా కుమారిని జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. తనకిచ్చిన గుర్తింపును బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు.