Andhra Pradesh

News September 26, 2024

విశాఖ: నేడు ఫార్మాసిటీని సందర్శించినన్న హై పవర్ కమిటీ

image

పరిశ్రమలకు సంబంధించి హై పవర్ కమిటీ ఛైర్ పర్శన్ వసుధ మిశ్రా గురువారం ఫార్మసిటీలో పర్యటించనున్నారు. ఇటీవల అచ్యుతాపురం, పరవాడలోని పలు ఫార్మా సిటీ కంపెనీలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా పరిశ్రమలను స్వయంగా పరిశీలించడానికి ఛైర్ పర్శన్ గురువారం విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పరిశ్రమల పరిశీలనకు వెళతారని అధికారులు తెలిపారు.

News September 26, 2024

కె.గంగవరం: పెంచుకున్న బాలికపై అత్యాచారం…రెండేళ్లకు అరెస్ట్

image

మద్యం మత్తులో పెంచుకున్న బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో కె.గంగవరానికి చెందిన నిందితుడిని రెండేళ్లకు అరెస్ట్ చేశామని పామర్రు ఎస్.ఐ జానీ బాషా బుధవారం తెలిపారు. బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ చేయించేందుకు 2022 సెప్టెంబర్ లో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడన్నారు. అప్పట్లో వైద్యుల ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో దొరికాడన్నారు.

News September 26, 2024

నల్లజర్ల: తిరుమల లడ్డూపై వాట్సాప్ పోస్ట్.. వ్యక్తి అరెస్టు

image

తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరుగుతోందనే ఆరోపణలపై మత ఘర్షణలు చెలరేగేలా వాట్సాప్ స్టేటస్ పెట్టిన పుల్లలపాడు గ్రామానికి చెందిన శివను అరెస్ట్ చేసినట్లు సీఐ నక్కా శ్రీనివాసరావు తెలిపారు. నల్లజర్ల మండలం బజరంగ్ దళ్ అధ్యక్షుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఆపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.

News September 26, 2024

సీఎం కర్నూలు పర్యటన వాయిదా

image

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడింది. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నేడు సీఎం పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. తాజాగా ఈ పర్యటన మళ్లీ వాయిదా పడింది. గతనెల 31న సీఎం పత్తికొండకు రావాల్సి ఉండగా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసిందే.

News September 26, 2024

వైసీపీ PAC కమిటీ మెంబర్‌గా వెల్లంపల్లి

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలోని పలు విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్‌ను నియమించారు.

News September 26, 2024

విశాఖలో నేడు హెరిటేజ్ వాక్..

image

ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపేలా గురువారం విశాఖ టౌన్ హాలు నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల మీదుగా హెరిటేజ్ వాక్ నిర్వహించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. హెరిటేజ్ వాక్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి జ్ఞానవేణి తదితరులు పాల్గొన్నారు.

News September 26, 2024

విజయనగరం జిల్లాలో అల్లు అర్జున్, జగన్ బ్యానర్లు

image

డెంకాడ మండలంలోని పినతాడివాడలో అల్లు అర్జున్ అభిమానులు వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. శ్రీ బంగారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్బంగా మాజీ సీఎం జగన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ‌లు గ్రామంలో వెలిశాయి. “YCP-AA MUTUAL” బ్యానర్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో యువత వీటి ఫొటోలను షేర్ చేస్తున్నారు.

News September 26, 2024

కడప జిల్లాలో 13 మంది అరెస్ట్

image

జిల్లాలో జూదం ఆడుతూ 13 మంది బుధవారం అరెస్టయ్యారు. ఎర్రగుంట్లలోని ఎరుకల కాలనీలో 8, సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లెలో <<14196593>>ఐదుగురి<<>>ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ.28,530 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనులు ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారు.

News September 26, 2024

ఒంగోలు: ‘బాలినేని అక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ గుర్తించాలి’

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి గురించి తెలుసుకోవాలని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో బాలినేని చేసిన అవినీతికి సాక్ష్యాలు చూపిస్తామని తెలిపారు. బాలినేనిని జనసేనలోకి చేర్చుకోవడం వల్ల జనసేన పార్టీ విలువలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

News September 26, 2024

గుంటూరు: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2,4,6వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.