Andhra Pradesh

News June 6, 2024

గుంటూరు ఇండిపెండెంట్ MP అభ్యర్థికి 172 ఓట్లు

image

గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.

News June 6, 2024

తూ.గో. జిల్లాలోనే అతితక్కువ ఓట్లు ఈ MLA అభ్యర్థికే

image

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటే సుబ్రహ్మణ్యానికి 53 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 1,34,414 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

ప.గో. జిల్లాలోనే అతితక్కువ ఓట్లు ఈ MLA అభ్యర్థికే

image

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కొనకాళ్ల శ్రీనివాస రావుకు 40 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు 1,30,424 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

కడప: ప్రజలు కసితో ఓటు వేశారు: మాజీ మంత్రి

image

ఐదేళ్ల అరాచకపాలనతో విసుగు చెందిన రాష్ర్ట ప్రజలంతా కసితో టీడీపీకి ఓటేశారని మాజీ మంత్రి, సి. రామచంద్రయ్య అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయి ప్రజలపై నిందలు వేయడం సరికాదన్నారు. జగన్ తీరుతో కడప జిల్లా ప్రజలు తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా దోచుకున్నారని వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

News June 6, 2024

ప్రకాశం: వైసీపీ కంచుకోటలు బద్దలు

image

ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటిది. TDP ఆవిర్భావం నుంచి రెండు సార్లే గెలిచింది. వైసీపీ రెండు పర్యాయాలు గెలిచి కంచుకోటగా మారింది. అలాంటిది ఈసారి అంచనాలను మారుస్తూ TDP నుంచి కందుల నారాయణరెడ్డి 13 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. అలాగే గిద్దలూరులో గత ఎన్నికల్లో 80 వేలకు పైగా మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఈసారి టీడీపీకి పట్టం కట్టారు. అశోక్ రెడ్డి 973 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

News June 6, 2024

పెనుగంచిప్రోలు: యువకుడి అనుమానాస్పద మృతి.?

image

పెనుగంచిప్రోలుకు చెందిన కార్తీక్, వత్సవాయి మం.వేమవరానికి చెందిన నాగరాజు మధ్య NTR స్టిక్కర్ తొలగించే విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కార్తీక్‌తో బలవంతంగా బైకుపై ఉన్న స్టిక్కర్ తీయించిన నాగరాజు, వీడియో కూడా తీసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపై కొద్దిసేపటికే వేమవరం సమీపంలో అనుమానాస్పదరీతిలో కార్తీక్ డెడ్‌బాడీ కనిపించిందని, వత్సవాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో వివాహిత ఆత్మహత్య

image

కొత్తూరు మండలం బత్తిలి రహదారిలో బుధవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన కృష్ణారావుతో పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఆర్. రేవతి (27)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. కృష్ణారావు కొత్తూరు అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు చక్కగా ఉండేవారని, ఆమె ఎందుకు అఘాయిత్యానికి పాల్పడిందో తెలియడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 6, 2024

విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు: ఎస్పీ

image

శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. అన్ని శాఖలు సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సహకరించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి వరకు విధులు నిర్వహించిన వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

News June 6, 2024

సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

image

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రధాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్లైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.

News June 6, 2024

నెల్లూరు రాజకీయాల్లో ఆనం సరికొత్త రికార్డ్

image

నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఆనం రామనారాయణ రెడ్డి రికార్డు సృష్టించారు.1983 నుంచి ఇప్పటివరకు 10సార్లు MLAగా పోటి చేసినా ఒకే నియోజకవర్గం నుంచి చేయలేదు. 4 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పలుమార్లు విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి వెంగటగిరి MLAగా గెలిచి టీడీపీలో చేరారు. తాజాగా ఆయన ఆత్మకూరు నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7576 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.