Andhra Pradesh

News June 6, 2024

సొంత మండలంలోనే పుష్పశ్రీవాణికి చుక్కెదురు

image

కురుపాంలో పుష్పశ్రీవాణికి సొంత మండలంలోనే చుక్కెదురయ్యింది. G.M వలసలో గతంలో ఆమెకు 173 మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 6,720 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. G.L పురంలో గతంలో 11,150 భారీ మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 2,300 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కురుపాం 9,459 మెజార్టీ రాగా.. ఈసారి TDPకి 2,800, కొమరాడలో YCPకి 3,668 మెజార్టీ రాగా.. ఇప్పుడు TDPకి 6,008, గరుగుబిల్లిలో ఈసారి TDPకి 3,926 మెజార్టీ వచ్చింది.

News June 6, 2024

కేఈ కుటుంబం నుంచి మూడోతరం ఎమ్మెల్యే

image

కేఈ కుటుంబం నుంచి మూడో తరం అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. కేఈ కృష్ణమూర్తి కుమారుడు టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవిపై 14,211 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేఈ మాదన్న 1967లో కర్నూలు నుంచి గెలుపొందగా.. ఆయన కుమారడు కేఈ కృష్ణమూర్తి డోన్ నుంచి 1978 నుంచి 1989 వరకు వరసగా నలుగుసార్లు గెలుపొందారు. అంతేకాకుండా ఆయన టీడీపీ ప్రభుత్వంలో నీటీపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.

News June 6, 2024

చిత్తూరు: 22 మండలాల్లో వర్షం

image

రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. 22 మండలాల్లో వర్షపాతం నమోదు అయ్యింది. గంగాధరనెల్లూరు 38.2 మి.మీటర్లు, నగరి 34.8, కార్వేటినగరం 34.2, బంగారుపాళ్యం 32.0, తవనంపల్లె 26.4, ఎస్ ఆర్ పురం 23.6, చిత్తూరు టౌన్ 23.0, బైరెడ్డిపల్లె 19.4, చిత్తూరు రూరల్ 15.0, నిండ్ర 11.6, సదుం 11.2 మీ. మీటర్లు కురవగా.. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.

News June 6, 2024

రొద్దం: వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగులు

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రొద్దం మండలంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని కొందరు దుండుగులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం చేయిని విరగ్గొట్టారని బుధవారం గుర్తించిన వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 6, 2024

విశాఖలో ఎండీఎంఏ పౌడర్ స్వాధీనం

image

విశాఖ నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పౌడర్ కలిగి ఉన్న ఒక యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఎండీఎంఏ పౌ‌డర్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు.. దీనిని ఎవరు సరఫరా చేశారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 6, 2024

25 ఏళ్ల తరువాత ఒంగోలు గడ్డపై TDP జెండా

image

ఒంగోలు పార్లమెంట్‌లో సుధీర్ఘ సమయం తరువాత TDP గెలిచింది. చివరిసారిగా 1999లో TDP అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి మాగుంట శ్రీనివాసులరెడ్డి (కాంగ్రెస్)పై గెలిచారు. 2004లో బత్తుల విజయలక్ష్మి, 2009లో ఎం.కొండయ్యపై మాగుంట గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత TDPలో చేరిన మాగుంట వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడారు. 2019లో శిద్దాపై మాగుంట గెలవగా, 2024లో చెవిరెడ్డిపై మాగుంట 48 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

News June 6, 2024

గుంటూరు జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి.?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి, యరపతినేని, జూలకంటి, గల్లా మాధవి, అనగాని, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వైసీపీ హయంలో అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.

News June 6, 2024

ప.గో.: RRR సరికొత్త రికార్డ్

image

ఉండి నియోజకవర్గంలో RRR సరికొత్త రికార్డ్ సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరగగా.. తొమ్మిది సార్లు గెలుపొందింది. ఒక్క 2004లోనే కాంగ్రెస్ గెలిచింది. 1978 నుంచి 1999 వరకు జె.రామచంద్రరాజు వరుసగా 6 సార్లు విజయం సాధించారు. మెజారిటీ పరంగా చూస్తే 2014లో టీడీపీ అభ్యర్థి శివరామరాజు 36231 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే తాజాగా RRR ఈ రికార్డ్ అధిగమించి 56,777 మెజార్టీ సాధించారు.

News June 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల

image

జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాయని డీఈవో దేవరాజు తెలిపారు. ఈ www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు మెరిట్ కార్డులు త్వరలో రాష్ట్రం నుంచి జిల్లా కార్యాలయానికి వస్తాయని చెప్పారు. ఉపకార వేతనాలకు అర్హత సాధించిన విద్యార్థులు తమ తల్లి లేక తండ్రితో ఏదైనా జాతీయ బ్యాంకులో జాయింట్ ఖాతా తెరవాలని సూచించారు.

News June 6, 2024

కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన మండలి బుద్ధ ప్రసాద్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు కూడా మంత్రి పదవులు రేసులో ఉన్నట్లు టాక్. వీరితో పాటు టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, బొండా ఉమా, తంగిరాల సౌమ్య, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.