Andhra Pradesh

News June 6, 2024

విశాఖ: ప్రశాంతంగా టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విశాఖ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నట్లు డిఇఓ చంద్రకళ తెలిపారు. బుధవారం విశాఖ జిల్లాలో మూడు కేంద్రాల్లో జరిగిన పదో తరగతి పరీక్షలకు 261 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు 206 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News June 6, 2024

మెరకముడిదాంలో బొత్సకు భారీగా తగ్గిన ఓట్లు

image

చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో గతంలో బొత్సకు 9 వేల ఆధిక్యత రాగా.. ఈసారి కళాకు 607 మెజార్టీ వచ్చింది. గతంలో బొత్సకు ఆరు వేల మెజార్టీ వచ్చిన గరివిడి మండలంలో ఈసారి కళా వెంకట్రావు 4,225 ఓట్ల ఆధిక్యత సాధించారు. చీపురుపల్లి గతంలో బొత్సకు 4వేల ఆధిక్యత రాగా.. ఈసారి టీడీపీకి 4,315 మెజార్టీ వచ్చింది. గుర్లలో గతంలో బొత్సకు 5,900 ఆధిక్యత సాధించగా.. ఈసారి టీడీపీకి 2,492 ఓట్ల మెజార్టీ వచ్చింది.

News June 6, 2024

బైరెడ్డిపల్లి: నలుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు

image

పాతపేటలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ మమత భర్త రవిచంద్రపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో పేల్చిన టపాకాయలు రవిచంద్ర ఇంటి వద్ద అతని కుమార్తె, సోదరుని కుమారుడిపై పడి గాయపడినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్నారులకు గాయాలయ్యేలా టపాకాయలు ఎందుకు కాల్చారని ప్రశ్నించడంపై దాడి చేశారని ఆరోపించారన్నారు.

News June 6, 2024

కాకినాడ: ప్రాణం తీసిన ఎన్నికల బెట్టింగ్

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక అప్పయ్యచెరువు ప్రాంతానికి చెందిన బిక్కిన సురేశ్ (30) ఎన్నికల్లో బెట్టింగ్ వేసిన వారికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో గెలిచిన వ్యక్తులు డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశారు. దీంతో తండ్రి సాయిబాబుకు ఫోన్‌లో ‘డాడీ నేను తట్టుకోలేకపోతున్నాను..‘ఐ మిస్ యూ డాడీ’ అని వాయిస్ మెసేజ్ పెట్టి ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదైంది.

News June 6, 2024

శ్రీకాకుళం: నేటితో ముగియనున్న ఎన్నికల నియమావళి

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు మూడు నెలల నుంచి అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి నేటితో ముగియనుంది. కోడ్ నేపథ్యంలో కొత్తగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. అధికార యంత్రం అంతా ఎన్నికల సంఘ పరిధిలో ఉండడంతో నిబంధనలు లోబడి విధులు నిర్వహించారు. నేటితో నియమావళికి తెరపడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించడంతో అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలు చేశారు.

News June 6, 2024

పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి?

image

గుంటూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ(3,44,695)తో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీలు అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి ఉపయోగం అని వారు అంటున్నారు. దీంతో పెమ్మసాని పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

News June 6, 2024

కృష్ణా: శాసనసభకు ఎవరెవరు ఎన్నోసారంటే..!

image

➤ సీనియర్లు: మండలి బుద్ధప్రసాద్(4వసారి), పార్థసారథి(4వసారి), గద్దె రామ్మోహన్(3వసారి), శ్రీరామ్ తాతయ్య(3వసారి) బోడె ప్రసాద్(2వసారి), బొండా ఉమ(2వసారి), వసంత కృష్ణప్రసాద్(2వసారి), తంగిరాల సౌమ్య(2వసారి), కొల్లు రవీంద్ర(2వసారి), కామినేని శ్రీనివాస్(2వసారి)
➤ తొలిసారి: వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, సుజనా చౌదరి, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు

News June 6, 2024

ఆమదాలవలస: గుణుపూర్ ట్రైన్ రద్దు

image

విశాఖపట్నం నుంచి గుణుపూర్ వరకు రెండు వైపులా నడిచే గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గురువారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ మాస్టర్ బుధవారం ప్రకటించారు. నౌపాడ, కోటబొమ్మాళి, తిలారు, పూండి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఈ ట్రైన్‌ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News June 6, 2024

ప.గో.: మంత్రి పదవి ఎవరికి..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. అయితే మన జిల్లాలో ముగ్గురు MLAలకు మంత్రులుగా అవకాశం వచ్చింది. తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ, తణుకు- కారుమూరి నాగేశ్వర రావు, కొవ్వూరు – తానేటి వనిత మంత్రులుగా పనిచేశారు. మరి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి 9మంది MLAలుగా గెలిచారు. ఈ సారి జిల్లాకు మంత్రి పదవి వచ్చేనా..?
– మీ కామెంట్..?

News June 6, 2024

కర్నూలు: ఐఏఎస్ వదులుకొని@ఇంతియాజ్!

image

ఏపీలో ఓ వెలుగు వెలిగిన కర్నూలు (D) కోడుమూరుకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. CM జగన్ ఆదేశాలతో YCPలో చేరి రాజకీయ అరంగ్రేటం చేసిన ఇంతియాజ్.. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినప్పటికీ ప్రజా ఆశీర్వాదం పొందలేకపోయారు. కాగా ఇంతియాజ్ IAS అధికారిగా ఉండి ఉంటే భవిష్యత్తులో కీలక హోదాల్లో పనిచేసేవారని విశ్లేషకులు భావిస్తున్నారు.