Andhra Pradesh

News June 6, 2024

కర్నూలు: కొనసాగిస్తారా..? కొత్తవారిని తీసుకుంటారా..?

image

రాజీనామాలు చేసిన వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందా, లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాలంటీర్లు దాదాపు అందరూ రాజీనామా చేశారు. టీడీపీ వచ్చాక రూ.పదివేలు వేతనం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రూ.5 వేలతో బాధ్యతగా పనిచేస్తూనే రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా లేక టీడీపీ నేతలు సిఫారసు మేరకు కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది వేచి చూడాలి.

News June 6, 2024

నీట్‌లో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

image

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆదర్శ కళాశాల, పాతపట్నంలో ఇంటర్ బైపీసీలో 953 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాలకే పేరు తెచ్చిన బండి గౌతమి 2024 నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 925వ ర్యాంకు, రీజనల్ స్థాయిలో 288వ ర్యాంకు సాధించింది. దీంతో ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ప్రిన్సిపల్ రత్నకుమారి అన్నారు. గౌతమికి కళాశాల తరుపున అభినందనలు తెలిపారు.

News June 6, 2024

నెల్లూరు: 30,948 మెజార్టీ వచ్చింది.. అనే మొక్కలు నాటుతా: కావ్య

image

కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అభివృద్ధి చేసి చూపుతానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కావలి పట్టణం ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. లోకల్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తానని తెలిపారు. నాకు వచ్చిన మెజారిటీ 30,948 కాబట్టి అన్ని మొక్కలు నాటుతానని తెలిపారు.

News June 6, 2024

VZM: ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ నాగలక్ష్మి

image

అంద‌రి స‌హ‌కారంతో జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌ని క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి తెలిపారు. ప్ర‌శాంతంగా, స్వేచ్చ‌గా, స‌జావుగా ఎన్నిక‌ల‌ను పూర్తి చేయ‌డానికి స‌హ‌కారం అందించిన అధికారులు, రాజ‌కీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, పాత్రికేయుల‌తో పాటు పౌరులందరికీ బుధవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ధన్యవాదాలు తెలిపారు.

News June 6, 2024

ఓట్ల లెక్కింపులో అధికారులు నిబద్దతగా వ్యవహరించారు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండు కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది నిబద్ధతతో వ్యవహరించారని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు.

News June 6, 2024

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం: ఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయమని ఎస్పీ తుషార్ తెలిపారు. బుధవారం ఆయన గుంటూరులోని కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి, పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, కేంద్ర బలగాలకు, ఇతర శాఖల అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

News June 6, 2024

అందరికీ ధన్యవాదములు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తవడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ మాధవీలత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగిందన్నారు. ఇది సమష్టి కృషి అని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలీసులు, భద్రత సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 6, 2024

‘విహార యాత్రను.. విషాద యాత్రగా మార్చొద్దు’

image

చీరాల సముద్ర తీరంలో స్నానం ఆచరించడానికి వచ్చిన యాత్రికులకు బుధవారం రూరల్ ఎస్సై శివ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విహార యాత్రను విషాద యాత్రగా మార్చవద్దని కోరారు. అందరూ సంయమనం పాటించాలని.. అధిక లోతుకు పోయి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ఆయన సూచించారు. బీచ్‌కు వచ్చే వారు అధికారుల సూచనలు పాటించాలన్నారు.

News June 6, 2024

విజయవంతంగా ఎన్నికలు విధులు నిర్వహించాం: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో విశాఖపట్నం జిల్లా అధికారులు, సిబ్బంది అనిర్వచనీయమైన పాత్ర పోషించారని, అప్పగించిన బాధ్యతల్ని అత్యంత అంకితభావంతో నిర్వహించారని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ.మల్లికార్జున అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులను అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 6, 2024

ప.గో: 4,500 ఎకరాల్లో పండ్లతోటల పెంపకానికి ఏర్పాట్లు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధిహామీ పధకం ఆధ్వర్యంలో 4,500 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ పధకంలో భాగంగా పంచాయితీ, ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంపకానికి 45 ఎకరాలు గుర్తించామన్నారు. రోడ్లు, కాల్వగట్ల వెంబడి 75 కిలోమీటర్ల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు.