India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.
తిరుమల ఎక్స్ ప్రెస్‌ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.
అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.
పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న పురుగు మందు తాగాడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.
Sorry, no posts matched your criteria.