Andhra Pradesh

News September 13, 2025

బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

image

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్‌ల కేటాయింపు జరుగుతుందన్నారు.

News September 13, 2025

శ్రీకూర్మనాథ క్షేత్రం పాలకమండలి నియామకం

image

గార(M) శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి పాలకవర్గ సభ్యులును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా(వంశపారంపర్య ధర్మకర్త) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరిస్తారు. తొమ్మిది మంది సభ్యులుగా సంయుక్త, కుసుమకుమారి, పెంటయ్య, శ్రీనివాసరావు, మునీక, శ్వేతబిందు, సూరిబాబు, కళ్యాణచక్రవర్తి, లక్ష్మిలను నియమించింది. అఫీషియో మెంబర్‌గా సీతారామనృసింహులు ఎన్నికయ్యారు.

News September 13, 2025

తూ.గో: నేడు కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టనున్న కీర్తి

image

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన చేకూరి కీర్తి నేడు విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత కలెక్టర్ ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగించనున్నారు. విశాఖకు చెందిన కీర్తి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. తొలుత చిత్తూరు జిల్లా సబ్-కలెక్టర్‌గా, ఉమ్మడి తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో జాయింట్ డైరక్టర్‌గా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఈమె మూడోవ కలెక్టర్.

News September 13, 2025

మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

image

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.

News September 13, 2025

విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.

News September 13, 2025

నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

News September 13, 2025

భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

image

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.

News September 13, 2025

నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

image

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.

News September 13, 2025

VZM: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికలు

image

రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికను ఆరికతోట జడ్పీ హైస్కూల్లో చేపట్టారు. ఇందులో 50 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా జూడో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నకిశోర్ తెలిపారు. అండర్14, 17, 19 జిల్లా జూడో టీం ఎంపిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 25 మంది బాలికలు, 25 మంది బాలురు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వెళ్లనున్నట్లు చెప్పారు.