Andhra Pradesh

News September 26, 2024

మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయండి: SP

image

పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి తెలిపారు. పార్వతీపురం పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి తరలివస్తున్న సారా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.

News September 26, 2024

విశాఖ: వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు

image

విశాఖ జిల్లాలో వాయు కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News September 26, 2024

ఇసుక ట్రాక్టర్లను పరిశీలించిన కలెక్టర్

image

చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసపల్లె వద్ద బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఇసుక స్టాక్ ను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారు లేదా అని ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు యజమానులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కానీ, మధ్యవర్తులుగాని ఇసుకను ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎక్కువకు తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు

News September 26, 2024

MP మాగుంటను ఫోన్‌ ద్వారా పరామర్శించిన చంద్రబాబు

image

మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట పార్వతమ్మ మరణించిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న CM నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మకి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు.

News September 26, 2024

పార్వతమ్మకు నివాళులర్పించిన సోమిరెడ్డి

image

ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ భౌతికకాయానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ నివాళులర్పించారు. పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో తెలియదు కానీ మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతక్క దంపతులను పార్వతీ పరమేశ్వరులుగానే చూశాం. పార్వతక్కను ఎప్పుడు పలకరించినా అక్కను మరిచిపోయావా అని అడిగేవారు. అప్పుడప్పుడూ కనిపించమంటూ ఆప్యాయంగా చెప్పేవారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

News September 26, 2024

జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి: పురందీశ్వరి

image

YS జగన్ తిరుమల పర్యటనపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘28న తిరుమలకు వెళ్తున్న జగన్ TTD అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. జగన్ అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నం.311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నం.16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News September 26, 2024

కడప:మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ పరీక్షలు

image

కడప జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు బుధవారం పేర్కొన్నారు. స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే అతి తక్కువ ఖర్చులోనే వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంటుందని సూచించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల్లోని మహిళలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 26, 2024

కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News September 26, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

అమరావతి సచివాలయంలో వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబుకు ఖాదర్ ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జైద్ అఫ్జల్ కాదర్, జీఎంఆర్ పలని అప్పన్ బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ స్వీట్స్ సంస్థ ప్రతినిధులు అందించారు. అనంతరం చంద్రబాబు వారిని అభినందించారు.

News September 26, 2024

వేంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

నక్కపల్లి మండలం వేంపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి నుండి తుని వైపు బైక్ మీద వెళ్లే దేవవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెనక నుంచి వెహికల్ ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.