Andhra Pradesh

News June 5, 2024

వైసీపీ పరువు కాపాడిన పెద్దిరెడ్డి

image

రాష్ట్రంలో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. జిల్లాలకు జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క పెద్దిరెడ్డి ఫ్యామిలీ కారణంగా రెండు జిల్లాల్లో వైసీపీకి క్లీన్ స్వీప్ బాధ తప్పింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు గెలిచారు.

News June 5, 2024

జలుమూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జలుమూరు మండలం తిలారు రైల్వేగేటు సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ చక్రధరరావు తెలిపారు. తిలారు రైలు నిలయం నుంచి ఉర్లాం వెళ్లే మార్గంలో మృతదేహం లభ్యమైందని ఆయన మంగళవారం పేర్కొన్నారు. మృతుడు పచ్చ తెలుపు పువ్వులు గల లుంగీ, నారింజ రంగు బనియన్ ధరించాడని వయసు సుమారు 75 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో భద్రపరిచామన్నారు.

News June 5, 2024

ప.గో.: మంత్రులంతా ఓటమి

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురూ ఓటమి పాలయ్యారు. కాగా మూడు చోట్ల గెలిచిన కూటమి అభ్యర్థులు 30 వేల పై చిలుకు మెజారిటీ సాధించడం మరో విశేషం.

News June 5, 2024

మీ సహకారానికి కృతజ్ఞతలు: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రంలో మాట్లాడుతూ నెల రోజులుగా కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వోలు, నోడల్ అధికారులు, ఏఆర్వోలు, సూపర్ వైజర్లు, పోలీస్ అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అన్ని విధాల సహకరించారన్నారు.

News June 5, 2024

గుడివాడ: రాజకీయ అరంగేట్రంలోనే 53 వేల మెజారిటీ

image

గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత వెనిగండ్ల రాము తాజా ఎన్నికలలో 53,040 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కొడాలి నానిపై గెలుపొందారు. గుడివాడలో తన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన రాము ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. రాముకు ఇవే తొలి ఎన్నికలు కాగా మొట్టమొదటి ఎన్నికలలోనే 53,040 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుడివాడ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

News June 5, 2024

తూ.గో.: ఫస్ట్ టైం MLAలు వీరే

image

తూ.గో. జిల్లాలోని మొత్తం 19 స్థానాల్లో గెలిచిన MLAలలో 9మంది తొలిసారే కావడం విశేషం.
– పిఠాపురం- పవన్ కళ్యాణ్
– కాకినాడ గ్రామీణం- పంతం నానాజీ
– రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
– రాజోలు- దేవ వరప్రసాద్
– పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ
– రామచంద్రపురం- వాసంశెట్టి సుభాష్
– రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
– తుని – యనమల దివ్య
– రంపచోడవరం – శిరీష
– వరుపుల సత్యప్రభ – ప్రత్తిపాడు
➤ SHARE IT

News June 5, 2024

నంద్యాల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్

image

నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ క్వీన్ స్వీప్ చేసింది.
☞ బనగానపల్లె (బీసీ జనార్దన్ రెడ్డి)
☞ ఆళ్లగడ్డ (భూమా అఖిల ప్రియ)
☞ నంద్యాల (ఎన్ఎండీ ఫరూక్)
☞ శ్రీశైలం (బుడ్డా రాజశేఖర రెడ్డి)
☞ నందికొట్కూరు (గిత్త జయసూర్య)
☞ డోన్ (కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి)
☞ పాణ్యం (గౌరు చరితా రెడ్డి) విజయం సాధించారు.

News June 5, 2024

ఒంగోలు వీడిన బాలినేని

image

ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్న YCP నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసలెడ్డి ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో ఉద్వేగానికి లోనయ్యారు. నిన్న నాలుగు రౌండ్లు పూర్తవ్వగానే కౌంటింగ్ కేంద్రం వెళ్లిపోయారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలినేని తన కటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన హౌదరాబాద్ కు వెళ్లారు. తనకివే చివరి ఎన్నికలు అని గతంలో ఆయనే చెప్పిన విషయం తెలిసిందే.

News June 5, 2024

ధ్రువపత్రాన్ని అందుకున్న సీఎం రమేష్

image

అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సీఎం రమేశ్ జిల్లా కలెక్టర్ రవి సుభాష్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.

News June 5, 2024

గురజాల, మాచర్ల అభ్యర్థులకు మంత్రి పదవి దక్కేనా?

image

గురజాల, మాచర్ల‌లో TDP అభ్యర్థులు గెలిచారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇక్కడి MLAలకు మంత్రి పదవి దక్కలేదు. గురజాల నుంచి వరుసగా 7సార్లు పోటీ చేసి 4సార్లు గెలిచిన యరపతినేనికి పలుమార్లు మంత్రి పదవి చేతిదాకా వచ్చి జారిపోయింది. ఒక దశలో యరపతినేని అనధికార హోంమంత్రిగా చక్రం తిప్పారు. చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన యరపతినేనికి రానున్న మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.