Andhra Pradesh

News June 9, 2024

అనంతపురం జిల్లాలో మంత్రి పదవులెవ్వరికి.?

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం వల్ల మంత్రి పదవులు కేటాయించడం కష్టంగా మారింది. కాగా జిల్లాలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తాయో వేచి చూడాలి.

News June 9, 2024

శ్రీకాకుళం: పార్ట్ టైం జాబ్ కాదు.. ఫుల్ టైం ఫ్రాడ్

image

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5 నెలల్లోనే 1022 సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదులు రాగా.. అందులో సుమారు 560 వరకు ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ లే ఉన్నాయని అధికారులు తెలిపారు. యువత బలహీనతలు గ్రహించి సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసగిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది అన్నారు. ఇలాంటి ఆన్ లైన్ సైట్ల ప్రకటనల జోలికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవొద్దని .. అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

News June 9, 2024

ఉమ్మడి విశాఖలో లోక్‌సభ స్థానాల వారీగా పోస్టల్ బ్యాలెట్ వివరాలు

image

➩ విశాఖలో 20,570 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా.. NDA కూటమి-13,583(66.03%), YCP-5,399(26.25%), INDIA కూటమి-837(4.07%) మంది ఓటేశారు
➩ అనకాల్లిలో మొత్తం 19,125 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-12,042(62.96%), YCP-5,777(30.20%), INDIA కూటమి-818(4.27%) మంది ఓటేశారు
➩ అరకులో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA కూటమి-9,312(43.44%), YCP-5,535(25.83%), INDIA కూటమి-4,113(19.19%) మంది ఓటేశారు

News June 9, 2024

గుంటూరు స్టేడియంలోని జిమ్‌కు ఎన్టీఆర్ పేరు

image

గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్‌కు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ పేరు పెట్టారు. టీడీపీ హయాంలో భవనం నిర్మించి జిమ్ ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి వైఎస్‌ఆర్ పేరు పెట్టారు. ఇవాళ టీడీపీ శ్రేణులు భవనం వద్ద శిలాఫలకం, వైఎస్ఆర్ పేరును తొలిగించి ఎన్టీఆర్ అక్షరాలను ఏర్పాటు చేశారు.

News June 9, 2024

వీరవాసరంలో యువతి మిస్సింగ్.. కేసు నమోదు

image

మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

News June 9, 2024

కామిరెడ్డికి బెయిల్ నిరాకరణ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు(M) చిల్లకూరులో గురువారం జరిగిన ఘర్షణలో YCP కీలక నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి బెయిల్ దొరకలేదు. ఆయనతో పాటు ఆళ్ల మణి, శ్రీనివాసులు, సుజిత్, చంద్రబాబు, పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, చెంచయ్య, చమ్మరతి పుట్టయ్యపై 341, 147, 148, 307, 324 RW 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. గుండె సమస్యలు ఉన్నాయని బెయిల్ కోరినా రాలేదు. వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

News June 9, 2024

పెద్దిరెడ్డి విదేశాలకు పారిపోకుండా చూడాలి: MLA

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సత్యవేడు నియోజకవర్గంలో ఖనిజ సంపదను పెద్దిరెడ్డి దోచేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్టు రద్దు చేయాలి. ఆయన అవినీతిపైన ప్రశ్నించినందుకే నాకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు నన్ను అక్కున చేర్చుకుని టికెట్ ఇవ్వడంతో గెలిచాను’ అని ఆదిమూలం అన్నారు.

News June 9, 2024

ఉరవకొండ: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర గాయాలు

image

వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి చిన్న తాండలో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వజ్రకరూర్ నుంచి గ్రామానికి బైక్ పై వెళుతున్న తులసి నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలో ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా.. ఇరుపార్టీల వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 9, 2024

గుడివాడ: కొడాలి నాని ఇంటిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

image

మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడి గుడ్లు విసిరిన ఘటనలలో పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వారికి మధ్య జరిగిన వాగ్వాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించిన దర్శిత్, సత్యసాయి, తదితురులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

News June 9, 2024

మొగల్తూరు: మురుగు కాలువలో మృతదేహం లభ్యం

image

పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై శనివారం కేసు చేశామని ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొగల్తూరుకు చెందిన  పాపయ్య(47) ఆ గ్రామానికి చెందిన ఓ రైతుకు మంగళగుంటపాలెంలో ఉన్న చెరువులో పని చేసేందుకు ఈ నెల 6న వెళ్లారు. ఆ రోజు నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా.. మంగళగుంటపాలెం సమీపంలోని మురుగు కాలువలో ఈ నెల 8న మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.