India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి రూ.1.60 కోట్లు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు యూపీలోని బరేలి ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్‌ను అరెస్టు చేసి రిమండ్‌కి తరలించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. జూన్ 24న బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.
విశాఖలోని VMRDA చిల్డ్రన్స్ ఏరినాలో డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో మందుల దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోలర్ విజయకుమార్ హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత పాల్గొని డ్రగ్స్ పై వివరించారు.
జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గోడ పత్రిక ఆవిష్కరించారు. జిల్లాలో 58 వేల పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తామన్నారు. రైతులు పశువులన్నింటికీ టీకాలు వేయించుకోవాలని కోరారు.
పరిపాలన సౌలభ్యం కోసం అనకాపల్లి, విజయనగరంలో నిర్మించిన VMRDA జోనల్ కార్యాలయాలను ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, IAS వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరంలో రూ.47.95 లక్షలు, అనకాపల్లిలో రూ.33.5 లక్షలతో పునఃనిర్మాణం చేసిన కార్యాలయాలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు మురళీకృష్ణ, వినయ్ కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.
కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్‌మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్‌కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
గండేపల్లి మండల ఎంపీడీవోగా పనిచేసి, ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన నాతి బుజ్జి, తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. శనివారం ఆమె హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం డిప్యుటేషన్ పద్ధతిలో జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.