Andhra Pradesh

News March 25, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.

News March 25, 2024

మరో రికార్డుకు చేరువలో విశాఖ పోర్టు

image

విశాఖ పోర్టు 90 ఏళ్ల చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 72.01 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేసిన పోర్టు.. ఈ ఆర్థిక సంవత్సరం 2023–24 ముగియకుండానే పోర్టు 79 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. సరుకు హ్యాండ్లింగ్‌లో కూడా గత ఏడాదితో పోల్చితే సోమవారంతో 73,52,899 టన్నులు అధికంగా హ్యాండ్లింగ్‌ చేసింది.

News March 25, 2024

రాయదుర్గంలో నవజాత శిశువు లభ్యం

image

రాయదుర్గంలోని మధుగులమ్మ దేవాలయం వద్ద ఓ సోమవారం సాయంత్రం చిన్నారిని గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలి వెళ్ళారు. పాప ఏడుపును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని రోడ్డుమీద ఏడుస్తున్న రెండు ఆ చిన్నారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

YCPలోకి చిత్తూరు ZP మాజీ ఛైర్మన్

image

చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు.

News March 25, 2024

కోసిగి: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.

News March 25, 2024

అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్

image

ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పొలమూరి మోహన్ బాబు బీఎస్పీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు బీఎస్పీ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

News March 25, 2024

శ్రీకాకుళం: అక్కడ ఒకరోజు తర్వాత హోలీ 

image

పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 

News March 25, 2024

శ్రీకాకుళం: పాము కాటుతో మహిళ మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News March 25, 2024

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

image

అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..? 

News March 25, 2024

కందుకూరులో వివాహిత దారుణ హత్య

image

కందుకూరు పట్టణంలో సోమవారం వివాహిత దారుణ హత్యకు గురైంది. గాయత్రీ నగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న వనజాక్షి(27) ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిన వనజాక్షి తండ్రికి ఆమె శవమై కనిపించింది. వనజాక్షి భర్తే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నఫీస్ బాషా కేసు దర్యాప్తు చేపట్టారు.