Andhra Pradesh

News June 7, 2024

శ్రీకాకుళం: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ(2017-18 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్, ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 7, 2024

పెదమానాపురం: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు ఢీకొనగా గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై రవివర్మ తెలియజేశారు. రైలు పట్టులు దాటుతుండగా మృతి చెందినట్లు చెప్పారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 7, 2024

గన్నవరంలో “నారా చంద్రబాబునాయుడు” అను నేను

image

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 12 ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నేతలు టీడీ జనార్దన్, అచ్చెన్నాయుడు తదితరులు శుక్రవారం కేసరపల్లిలో ఎంపిక చేసిన సభాస్థలాన్ని పరిశీలించారు.

News June 7, 2024

VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

image

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.

News June 7, 2024

లోకేశ్‌ని కలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తనని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఫోటో దిగారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్, హీరో నిఖిల్ పాల్గొన్నారు.

News June 7, 2024

ప్రకాశం: వైసీపీ కార్యకర్తలకు అండగా కమిటీ ఏర్పాటు

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా జంకే వెంకట్ రెడ్డి, కమిటీ ఇన్‌ఛార్జ్‌గా చెవిరెడ్డి, కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి బాలినేని, ఆదిమూలపు సురేశ్, అన్నా రాంబాబు, తాటిపర్తి చంద్రశేఖర్‌ ఉన్నారు. వీరు న్యాయపరంగా, ఆర్థికంగా బాధితులకు అండగా ఉంటారని జగన్ తెలిపారు.

News June 7, 2024

లీడ్ క్యాంప్ డైరెక్టర్‌ పదవికి సందీప్ రాజీనామా

image

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ వైసీపీ నాయకులు సొంగ సందీప్ లిడ్ క్యాంప్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి తమవంతు కృషి చేస్తానని అన్నారు.

News June 7, 2024

కర్నూలు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య 

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జామున కైరన్ బీ(26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుట్టింటికి పంపలేదని అత్తింటి వేధింపులతో తాళలేక మనస్తాపంతో వేకువజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News June 7, 2024

వేట కొడవళ్లతో వీరంగం సృష్టించారని చెప్పడం అసత్య ప్రచారం: ఎస్‌పీ

image

రామగిరి మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో వేట కొడవళ్లు పట్టుకొని వీరంగం సృష్టిస్తున్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల తర్వాత కొందరు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదన్నారు. సంబరాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేమన్నారు.

News June 7, 2024

పార్వతీపురం: పోస్టల్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పే అవకాశం

image

సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా గెలిచిన నాయకులకు ఈ పోస్ట్ సర్వీస్ ద్వారా అభినందనలు తెలిపే వెసులుబాటును పోస్టల్ శాఖ కల్పించిందని సూపరింటెండెంట్ రెడ్డి బాబురావు రావు అన్నారు. కేవలం రూ.10 చెల్లించి సమీప తపాలా కార్యాలయంలో ఈ పోస్టు ద్వారా తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు అన్నారు. ఇలా పంపించిన సందేశాలు నేరుగా నేతలకు వెళ్తాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.