Andhra Pradesh

News June 7, 2024

నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండెపోటుతో మృతి

image

బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జి రెడ్డి శుక్రవారం మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులతో పాటు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.

News June 7, 2024

టీచర్ల బదిలీలలో అక్రమ వసూళ్లు: గండి బాబ్జి

image

టీచర్లను బదిలీ చేస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3నుంచి 6 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై టీచర్లు ఫిర్యాదు చేసారన్నారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News June 7, 2024

శ్రీకాకుళం: డబుల్ రికార్డ్ బ్రేక్ చేసిన కలిశెట్టి

image

విజయనగరం ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు డబుల్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ MPలుగా గెలిచిన వారెవరికీ రాని మెజార్టీ అప్పలనాయుడు సాధించడం ఒకటి కాగా, శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం MPగా ఎన్నికైన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. అప్పలనాయుడు YCP ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.

News June 7, 2024

పాడేరు: ఐదురోజుల భారీ వాహనాలు నిషేధం

image

మోదకొండమ్మ జాతర సందర్భంగా రేపటి నుంచి ఐదు రోజులపాటు పాడేరు ఘాట్‌లో భారీ వాహనాలను నిషేధించామని కలెక్టర్ విజయ సునీత తెలియజేశారు. అమ్మవారి జాతర ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ఉత్సవ కమిటీతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో పాటు ఉత్సవ కమిటీకి సూచించారు.

News June 7, 2024

ప.గో.: అప్సడా వైస్‌ఛైర్మన్ రాజీనామా

image

ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ ఛైర్మన్ పదవికి, క్యాబినెట్ హోదాకు వడ్డీ రఘురాం నాయుడు శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ  మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీకి అందజేసినట్లు వివరించారు. 2026 మార్చి వరకు తన పదవీకాలం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

News June 7, 2024

తాడేపల్లిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం

image

తాడేపల్లి పరిధి బ్రహ్మానందపురం వద్ద ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు సభా స్థలాన్ని పరిశీలించారు. 80 కంటే ఎక్కువ వాహనాలలో సభా ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రి చేరుకుంది. సుమారు 200 ఎకరాల ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి ప్రముఖులు హాజరుకానున్నారు.

News June 7, 2024

ఆ ఫైల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: జనసేన

image

ఉత్తరాంధ్రాలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్‌లపై నిఘా పెట్టాలని, సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలక్టరేట్ల నుంచి అసైన్డ్ ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

News June 7, 2024

BREAKING: శ్రీసత్యసాయి జిల్లాలో పోలీసుల కారు బోల్తా

image

శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలో అదుపుతప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. సోమందేపల్లి మండల పరిధిలోని పూలే కమ్మ గుడి వద్ద పెనుకొండ డిఎస్పీ బాబిజాన్ సైదా, కానిస్టేబుళ్లు సోమందేపల్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలైన వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 7, 2024

తంబళ్లపల్లె : వైసీపీ ఓటమి…కీలక పదవికి రాజీనామా

image

ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌ పదవికి మిట్టపల్లి భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. కన్నబాబుకు పంపించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు .

News June 7, 2024

చెవిటి పిల్లలకు విజయనగరంలో ప్రత్యేక పాఠశాల

image

విజయనగరం పేర్ల వారి వీధిలో గల చెవిటి పిల్లల పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు సెక్రటరీ కె.ఆర్.డి ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేది నుండి ఉ 9 గం.లనుండి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉచిత విద్య, బాలబాలికలకు వేరు వేరు హాస్టల్లో ఉచిత వసతి కల్పించబడునని, డిజిటల్ క్లాస్ ద్వారా పాఠాలు బోధించబడునన్నారు. వివరాలకు సంప్రదించాలన్నారు.