Andhra Pradesh

News September 26, 2024

కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News September 26, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

అమరావతి సచివాలయంలో వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబుకు ఖాదర్ ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జైద్ అఫ్జల్ కాదర్, జీఎంఆర్ పలని అప్పన్ బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ స్వీట్స్ సంస్థ ప్రతినిధులు అందించారు. అనంతరం చంద్రబాబు వారిని అభినందించారు.

News September 26, 2024

వేంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

నక్కపల్లి మండలం వేంపాడు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి నుండి తుని వైపు బైక్ మీద వెళ్లే దేవవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెనక నుంచి వెహికల్ ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఇద్దరు యువకులు మరణించారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

ఏ.కొండూరు అడ్డరోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏ.కొండూరు అడ్డరోడ్డులో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా తెలుస్తోండగా.. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

➤ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి
➤ గుంటూరు: రేపు జనసేనలో చేరుతున్నా.. కిలారి
➤ నేడు గుంటూరు జిల్లా నాయకులతో జగన్ సమావేశం
➤ తాడేపల్లి YCP కార్యాలయం వద్ద మాజీ MLAలు
➤ గుంటూరులో జాబ్ మేళా.. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు
➤ గుంటూరు: గడ్డపారతో భార్య తల పగలకొట్టిన భర్త

News September 26, 2024

కడప జిల్లాలో 252 మంది వీఆర్వోలు బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా 252 మంది వీఆర్వోలను బదిలీ చేసినట్లు కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను, వార్డు రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేసినట్లు తెలిపారు. వీఆర్వోలకు కేటాయించిన స్థానాలలో చేరాలని సూచించారు.

News September 26, 2024

కేసుల్లో పురోగతి సాధించండి: ఎస్పీ గంగాధర్

image

కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. మచిలీపట్నం
జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేసి, స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందించి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

News September 25, 2024

కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

image

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2024

విశాఖలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

image

ఆరిలోవ బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సమాజం సిగ్గుపడే విధంగా ఓ తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్సై కృష్ణ వెల్లడించారు. ఒడిశాకు చెందిన వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. పెద్ద కుమార్తె స్కూల్లో పలుమార్లు కళ్లు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే సమాచారం తల్లికి తెలిపారు. బుధవారం తల్లి పోలీసులను ఆశ్రయించింది.

News September 25, 2024

పోలేరమ్మ జాతర-2024 ఫొటో ఇదే..!

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారు పుట్టినిల్లు అయిన కుమ్మరి వారి ఇంట అమ్మవారి ప్రతిమ సిద్ధమైంది. మరికాసేపట్లో ఊరేగింపుగా మెట్టినిల్లు అయిన చాకలి వారి ఇంటికి చేరుకోనున్నారు. అక్కడ దిష్టి చుక్క, కనుబొమ్మ పెట్టాక అమ్మవారి గుడి దగ్గరకు తీసుకు వచ్చి ప్రతిష్ఠిస్తారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.