Andhra Pradesh

News June 6, 2024

శతాబ్ది ఉత్సవాలకు గంధర్వ మహల్ ముస్తాబు

image

ఆచంటలోని గంధర్వ మహల్‎ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‎టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్‎లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.

News June 6, 2024

గుంటూరు: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి

image

రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

News June 6, 2024

అనంత: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

చిలమత్తూరు మండల కేంద్రంలోని కొడికొండ చెక్ పోస్ట్ ప్రధాన రహదారి ఆదేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వాహనదారులు ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 6, 2024

గోదావరిలో మహిళ మృతదేహం

image

తాళ్లపూడి మండల కేంద్రంలోని ట్యాక్సీ స్టాండ్ సమీపంలో గోదావరి నదిలో గురువారం మధ్యాహ్నం మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై శ్యాంసుందర్ తెలిపారు. మృతురాలి వయసు 45-50 సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉందని, ఆచూకీ తెలిసిన వారు 94407 96625 నంబర్‌కు సంప్రదించాలని ఎస్సై కోరారు.

News June 6, 2024

కృష్ణా: ఎన్నికల నిర్వహణలో కలెక్టర్, ఎస్పీల కృషి భేష్

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం చేసిన కృషి సఫలీకృతమైంది. ఏ చిన్న పొరపాటుకు అస్కారం లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువురు అధికారులు ఎంతో సమస్వయంతో వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన కలెక్టర్, ఎస్పీలు జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. 

News June 6, 2024

టెక్కలి: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

image

మణిపుర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన మెట్ట తేజేశ్వరరావు(33) అనే సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి తమ బెటాలియన్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తేజేశ్వరరావు మృతి చెందాడు. దీంతో జవాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని టెక్కలి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.

News June 6, 2024

నెల్లూరు: రికార్డు తిరగరాసిన ఎమ్మెల్యే

image

సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. ఈ ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యపై 29115 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును నెలవల విజయశ్రీ తిరగరాశారు. అయితే సూళ్లూరుపేటలో 1962 నుంచి 2024 వరకు ఎన్నికలు జరిగగా..1983లో మైలరీ లక్ష్మీకాంతమ్మ, 2009లో విన్నమాల సరస్వతి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడి పోయారు.

News June 6, 2024

కడప: వైవీయు LLB పరీక్షా ఫలితాలు విడుదల

image

వైవీయు LLB 3, 5 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలు వీసీ ఆచార్య చింత సుధాకర్, కుల సచివులు ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డితో కలిసి గురువారం ఫలితాలను విడుదల చేశారు. LLB ఐదేళ్ల కోర్సులో భాగంగా 3 సెమిస్టర్ పరీక్షలో 50 శాతం, 5 సెమిస్టర్‌లో 74.68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. వైవీయు వెబ్‌సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచారని తెలిపారు.

News June 6, 2024

నెలరోజుల్లో అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేస్తా: పల్లా

image

గాజువాక నియోజకవర్గం పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజాను నెలరోజుల్లో ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానన్నారు. గాజువాక ఖ్యాతి దేశానికి తెలిసేలా తనకు అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

News June 6, 2024

విజయవాడ: ’16న సివిల్స్ ప్రిలిమ్స్‌కు పటిష్ఠ ఏర్పాట్లు’

image

యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో యూపీఎస్సీ అధికారులు.. ప‌రీక్షా కేంద్రాలున్న జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌కు కలెక్ట‌ర్ డిల్లీరావు క్యాంపు కార్యాల‌యం నుంచి హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లో ప‌రీక్షను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.