Andhra Pradesh

News June 6, 2024

సామాన్య కార్యకర్తను ఎంపీగా చేశారు: కలిశెట్టి

image

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నివాసం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని అన్నారు. ఈ స్థాయికి‌‌ తీసుకువచ్చిన చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చానని‌ ఆయన తెలిపారు.

News June 6, 2024

శ్రీకాకుళం: నోటాకు అత్యధిక.. అత్యల్పం ఇక్కడే

image

ఇచ్ఛాపురం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధికంగా ఎచ్చెర్లలో నోటాకు ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా ఆమదాలవలసలో పడ్డాయి. ఈసారి అత్యధికంగా శ్రీకాకుళంలో 4,270 మంది, అత్యల్పంగా ఇచ్ఛాపురంలో 744 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉన్నప్పటికీ వారి కంటే NOTAకే పడటం గమనార్హం.

News June 6, 2024

కడప: ఐటీఐలో ప్రవేశాలకు జూన్ 10 తుది గడువు

image

కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజ్‌ల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుది గడువని కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.జ్ఞాన కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఐటీఐల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.

News June 6, 2024

డాక్టర్ నుంచి అరకు ఎంపీగా

image

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి గెలుపొందారు. హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన తనూజరాణి ఎంబీబీఎస్ చేశారు. వైద్య వృత్తిలో డీఎంహెచ్‌వో, ఐసీడీఎస్ కార్యాలయాల్లో జిల్లా ఎపిడెమియాలజిస్టుగా పనిచేసేవారు. 2022లో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కుమారుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్‌ను వివాహమాడారు.

News June 6, 2024

శ్రీకాకుళం: అన్ని శాఖలు సమన్వయం.. సమిష్టి కృషి

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థి, 8 నియోజకవర్గాల శాసన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

News June 6, 2024

YCP కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడి రాజీనామా

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఉపాధ్యక్ష పదవికి అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన వూటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలిపారు.

News June 6, 2024

శ్రీకాకుళం: ఓకే నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ

image

ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు గెలుపొందడంతో అక్కడ ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒకే నియోజకవర్గానికి చెందినవారు. ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేశారు.

News June 6, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న రీ వాల్యుయేషన్ గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా, పీజీ కోర్సుల పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు శుక్రవారంలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

నెల్లూరు: మంత్రి పదవి ఎవరికి.. జోరుగా ప్రచారం

image

నెల్లూరు జిల్లాలో టీడీపీ పదికి పది స్థానాలు దక్కించుకుంది. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా నారాయణ, ఇరిగేషన్ మంత్రిగా ఆనం, వ్యవసాయ మంత్రిగా సోమిరెడ్డి పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

News June 6, 2024

దేవీపట్నం: నడిరోడ్డుపై తల్లి, బిడ్డను వదిలేశారు

image

దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జోగమ్మ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రసవించింది. వైద్యసేవల అనంతరం తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో అకూరు గ్రామం వద్ద రోడ్డుపై వదిలి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించి ఆటోపై ఆమె చింతలగూడెం గ్రామానికి వెళ్లారు.