India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డాక్టర్ అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను జిల్లావ్యాప్తంగా వినియోగిస్తామన్నారు.
కడప కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.
జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 577 వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 91 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 171 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.
జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కీర్తి చేకూరి సెప్టెంబర్ 13న మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆమె గతంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ జిల్లాలో గతంలో జాయింట్ కలెక్టర్‌గా కూడా ఆమె పనిచేశారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
KGH అభివృద్ధిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్ని విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలు, వసతులపై చర్చించారు. ఆంకాలజీకి 30 మంది స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో విభాగానికి పరికరాలు, ఎండోక్రనాలజీకి మరమ్మతులు ప్రతిపాదించారు. వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం విశాఖ రానున్నారు. శనివారం ఉదయం 8గంటలకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారు. దీనికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.