Andhra Pradesh

News March 21, 2024

విమానాలకు పక్షుల అంతరాయాన్ని నివారించేందుకు స్ప్రే డ్రోన్లు

image

విశాఖ విమానాల రాకపోకలకు పక్షులు అంతరాయాన్ని నివారించేందుకు తూర్పు నావికాదళంలో వైమానిక బృందం స్ప్రే డ్రోన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి వీటి ఆపరేషన్స్‌ చేపడుతున్నారు. తద్వార పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమని భావిస్తున్నారు.

News March 21, 2024

ప.గో: ఇంగ్లీష్ పరీక్షకు 665 మంది విద్యార్థులు డుమ్మా!

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. ఇంగ్లీష్ పరీక్షకు 21,238 మందికి గాను 20,573 మంది హాజరయ్యారని, 665 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

News March 21, 2024

అనకాపల్లి: ఏ.ఎల్ పురం చెక్‌పోస్టు వద్ద రూ.లక్ష సీజ్

image

గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో ఆధారాలు లేని రూ.లక్ష నగదు సీజ్ చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన నానిబాబు తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేశామన్నారు. ఏ ఆధారాలు లేని రూ.లక్ష సీజ్ చేసి.. నగదును తహశిల్దార్‌కి పంపించామన్నారు.

News March 21, 2024

విజయనగరంలో గంజాయితో వ్యక్తి అరెస్టు 

image

విజయనగరం రైల్వే స్టేషన్ పక్కన గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా గంజాయితో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. అతని వద్ద నుంచి 9 కిలోల గంజాయి, రూ.1070 నగదు, ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు.

News March 21, 2024

అల్లూరి: ‘సింగిల్ విండో విధానంలో అనుమతులు’

image

పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని జేసీ భావన వశిస్ట్, ITDA పీఓ వి.అభిషేక్ అన్నారు. పాడేరు కలెక్టరేట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాలకు ఎన్నికల పోర్టల్స్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సువిధ యాప్ నుండి దరఖాస్తులు స్వీకరించి, ఎన్‌కోర్ యాప్ నుంచి అనుమతులు జారీ చేస్తామన్నారు. రిటర్నింగ్ అధికారుల ఆమోదం లేకుండా ఎటువంటి అనుమతులు జారీ చేయకూడదన్నారు.

News March 21, 2024

కడప: ప్రశాంత ఎన్నికల కోసం అందరి సహకారం

image

ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జేసీ గణేశ్ కుమార్, కడప కమిషనర్ ప్రవీణ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా ప్రచారం చేయాలన్నా కూడా అనుమతులు తప్పనిసరన్నారు. సభలు సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.

News March 21, 2024

స్ట్రాంగ్ రూమ్‌లలో ఏర్పాట్లు త్వరగా చేపట్టాలి: కలెక్టర్

image

సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, ఈవీఎంల కమిషనింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల కోసం ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

News March 21, 2024

ఉండిలో 9 మంది వాలంటీర్ల తొలగింపు: కలెక్టర్

image

ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న వాలంటీర్స్ పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 9 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2024

మద్యం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మద్యం గోడౌన్, తయారీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తనిఖీ చేశారు. బుధవారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దేవరపాలెం వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.

News March 21, 2024

స్ట్రాంగ్ రూములు పటిష్టంగా ఏర్పాటు చేయండి :కలెక్టర్

image

ఎన్నికల కోసం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను పటిష్టంగా ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్ల ఏర్పాటును పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.