Andhra Pradesh

News March 20, 2024

నాకు ఇవే చివరి ఎన్నికలు: మాజీ మంత్రి అయ్యన్న

image

తనకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ నర్సీపట్నం నియోజకవర్గ TDP అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. బుధవారం రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News March 20, 2024

మన్యం: ప్రశాంతంగా ఇంగ్లీష్ పరీక్ష

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 66 కేంద్రాలలో నేడు నిర్వహించిన పదవ తరగతి మూడవ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి జి.పగడాలమ్మ తెలిపారు. జిల్లాలో 10,554 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,470 మంది హాజరు అయ్యారని, 84 మంది గైర్హాజరు అయ్యారని ఆమె అన్నారు. జిల్లాలో 24 కేంద్రాలలో స్క్యాడ్లు, డీఈఓ 6 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు చేశారు. జిల్లాలో 99.20 శాతం హాజరు నమోదయింది.

News March 20, 2024

శ్రీ సత్యసాయి: ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.

News March 20, 2024

29న కర్నూలు జిల్లాలో ‘మేము సిద్ధం’: మంత్రి పెద్దిరెడ్డి

image

ఈనెల 29న సీఎం జగన్ మేము సిద్ధం బస్సుయాత్ర ఎమ్మిగనూరులో నిర్వహించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులోని త్రిగుణ క్లార్క్ ఇన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ పొన్నం రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. 29న ఎమ్మిగనూరులో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు.

News March 20, 2024

అప్పుల బాధతో కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యం

image

కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం కొత్త పోలవలస సర్పంచ్ వెంకట శ్యామ్‌కుమార్ బుధవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆయన భార్య ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల పలువురి నుంచి నగదు అప్పుగా తీసుకుని.. అది తీర్చలేక పోవడంతోనే మనస్తాపం చెంది వెళ్లిపోయారని తెలిపారు.

News March 20, 2024

ఏఎస్ పేట మండలంలో వాలంటీర్‌పై వేటు

image

ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News March 20, 2024

పార్వతీపురంలో బీటెక్ విద్యార్థి సూసైడ్

image

పార్వతీపురం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుసుమగుడి వీధికి చెందిన కల్లూరి తారకేశ్వరరావు(20) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా అనే కారణంతో మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడన్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై సంతోషి కుమారి వివరాలను నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

News March 20, 2024

మైలవరం: 11 మంది వాలంటీర్ల తొలగింపు

image

దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.

News March 20, 2024

తిరుపతి జూ నుంచి నల్లమల అడవికి మూడు పులి పిల్లలు

image

నంద్యాల జిల్లాలో జనావాసాల మధ్య దొరికిన నాలుగు పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి ఎస్‌వీ జూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు పులి పిల్లల్ని నల్లమల అభయారణ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పులి పిల్లలకు వేటాడటం నేర్పించేందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టారు.

News March 20, 2024

తిరుపతి రీజియన్‌లో BOB 3 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం

image

భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో రాయచోటి, వీరబల్లి, జమ్మలమడుగులో (50, 51, 52 వ బ్రాంచీలు) 3 కొత్త బ్రాంచ్ కార్యాలయాలను NDGM-1 గోవింద్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. AGM & రీజినల్ హెడ్ P.అమరనాథ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ B.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తమ సేవలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు.