India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.
లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం సాయంత్రం ఆయన జైలులో లొంగిపోయారు. రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ చేపట్టనున్నారు.
విశాఖలో సెప్టెంబర్ 22, 23వ తేదీల్లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట రెండు రోజుల నోవాటెల్ హాటళ్లో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు, ఏపీ సీఎం, కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఆదేశించారు.
మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపిస్తుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. వరికుంటపాడు పాఠశాలలో తెల్లన్నం, ఆలుగడ్డ కూర పెట్టారు. కందుకూరులో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బోగోలు పాఠశాలలో కూర్చునే సౌకర్యం లేదు. గుడ్లూరులో మెనూ ప్రకారం వడ్డించినా విద్యార్థులు తినలేదు. అధికారులు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రాజమండ్రిలో 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి కొవ్వూరుకు సైకిల్ పై వస్తుండగా గామన్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయాలపాలైన అతడిని స్థానికులు అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా గురువారం రాత్రి మృతి చెందినట్లు సీఐ విశ్వం తెలిపారు.
జిల్లాలో అద్దె, శిదీలావస్థకు చేరుకున్న పంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు మోక్షం లభించింది. దీంతో జిల్లాలో తోలుత 40 చోట్ల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరవగా, ఒక్కోదానికి రూ. 32లక్షలు వెచ్చించనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద నిధులు కేటాయించనున్నారు.
పలాసకు చెందిన ఓ బాలుడు హైదరాబాదులో ఉంటున్న వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గురువారం పలాస రైల్వే స్టేషన్‌లో విశాఖఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం అర్ధరాత్రికి రైలు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు వివరాలను అడిగగా తనది పలాస అని చెప్పాడు. ఈ బాలుడిని గుంటూరు రైల్వే ఛైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉంచారు.
కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
శ్మశాన వాటిక సమీపంలో ఉందంటేనే నివాసం ఉండేందుకు కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కావలిలో మాత్రం సమాధులతోనే కొందరు సావాసం చేస్తున్నారు. గతంలో అక్కడి పెద్దలు శ్మశానానికి 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి అన్యాక్రాంతం అయింది. సమాధులు ఆక్రమించుకుని మరీ ఇల్లును నిర్మించుకోవడంతో, ఇంటి ముందే సమాధులు దర్శనమిస్తున్నాయి. భయం లేకుండానే కాపురాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.