Andhra Pradesh

News June 5, 2024

చంద్రబాబును కలిసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి

image

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కూటమి ఘనవిజయం సాధించేలా కృషి చేసినందుకు చంద్రబాబుకు మాగుంట ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట కొడుకు రాఘవరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. అనంతరం సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా మాగుంట కలిశారు.

News June 5, 2024

నెల్లూరు పాత కలెక్టర్‌కు భారీ ఓటమి

image

కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 54,844 ఓట్లే వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు నోటాకు 15,577 ఓట్లు పడ్డాయి. కాగా రాజు 1988 నుంచి 1992 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News June 5, 2024

డిపాజిట్ కోల్పోయిన పూతలపట్టు MLA

image

చిత్తూరు జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా డిపాజిట్ కోల్పోయాడు. ఆయనే ఎంఎస్ బాబు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన 29,163 ఓట్లతో భారీ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ సీటు ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఆయనకు కేవలం 2,820 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి మురళీ మోహన్ 15,634 ఓట్లతో గెలిచారు. దీంతో బాబు డిపాజిట్ కోల్పోయారు.

News June 5, 2024

గోదారోళ్ల దెబ్బ.. ఇక జనసేనకు ‘గాజు గ్లాస్’..!

image

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా గెలిచి TDP తర్వాత అత్యధిక MLAలతో అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో జనసేనకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ ఖరారు చేయనుండటం వారికి మరో గుడ్ న్యూస్. 21 స్థానాల్లో మన ఉభయ గోదావరి నుంచే 11 ఉండటం గమనార్హం. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలవగా.. జనసేన రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. మన ఉభయ గోదారోళ్లు ఎక్కడా వైసీపీని ఆదరించలేదు.

News June 5, 2024

గుంటూరు పార్లమెంటులో తొలిసారి 60.68 శాతంతో విజయం

image

గుంటూరు ఎంపీ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4,205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. అయితే 2024లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని.. రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పెమ్మసానికి 60.68 శాతంతో భారీ మెజారిటీ సాధించారు.

News June 5, 2024

పిఠాపురం కంటే పెందుర్తిలోనే మెజార్టీ ఎక్కువ

image

జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో పెందుర్తిలోనే అత్యధిక మెజార్టీ సాధించింది. పెందుర్తిలో పంచకర్ల రమేశ్ బాబుకు.. పవన్‌కళ్యాణ్‌ కంటే 10 వేల ఓట్ల ఎక్కువ మెజార్టీ వచ్చింది. పంచకర్లకు 81,870 ఓట్ల మోజార్టీతో రాగా.. పవన్‌కు 70,279 మెజార్టీ వచ్చింది. ఉమ్మడి విశాఖలో మిగిన 3 స్థానాల్లో అనకాపల్లిలో కొణతాల-65,764, యలమంచిలిలో సుందరపు విజయ్‌-48,956, విశాఖ సౌత్‌లో వంశీకృష్ణ-64,594 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు.

News June 5, 2024

25 ఏళ్ల తరువాత కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలు TDP కైవసం

image

1985లో నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. 1989, 1991, 1996లో టీడీపీ గెలవలేకపోయింది. 1998లో నంద్యాలలో టీడీపీ గెలవగా.. కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది. 1999లో కర్నూలు, నంద్యాల స్థానాల నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019లో ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు చోట్లా టీడీపీ గెలిచింది.

News June 5, 2024

అనంత జిల్లాలో గెలుపొందిన అభ్యర్థుల మెజార్టీలు ఇవే..!

image

అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. 8 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందారు.
☞ బండారు శ్రావణి శ్రీ 8,788
☞ అమిలినేని సురేంద్ర బాబు 37,734
☞ పయ్యావుల కేశవ్ 21,704
☞ పరిటాల సునీత 23,329
☞ జేసీ అస్మిత్ రెడ్డి 25,865
☞ గుమ్మనురు జయరాం 6,826
☞ కాలవ శ్రీనివాసులు 41,659
☞ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 23,023

News June 5, 2024

CTR: ఎక్కడి నుంచి వచ్చామని కాదు..!

image

చిత్తూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఘన విజయం సాధించారు. బాపట్లకు చెందిన ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. నాన్ లోకల్ అయిన ఆయన లోకల్‌గా ఉన్న వైసీపీ అభ్యర్థి రెడ్డప్పని 2.20 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇకపై ఆయన జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని దగ్గుమళ్ల అనుచరులు చెబుతున్నారు.

News June 5, 2024

పల్నాడు: అప్పుడు 10%… ఇప్పుడు 10%

image

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ మధ్య 10 శాతం ఓట్ల తేడా కనిపించింది. కాగా శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటిపై కూడా 10 శాతం అదనంగా ఓట్లు పొంది గెలుపొందారు. గతంలో మెజారిటీ 1,35,220 కాగా ఈసారి మరింత పుంజుకుని 1,59,729కి పెరిగింది.